Advertisement

పూరీ దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో తెలుసా?

Aug 8 2020 @ 19:49PM

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ‘పూరీ మ్యూజింగ్స్’ అంటూ తన వాయిస్ ఓవర్‌తో కొన్ని వీడియోలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. ఏదో ఒక టాపిక్ తీసుకుని దానిపై తనకున్న అభిప్రాయం ఏమిటో చాలా విపులంగా పూరి తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఎన్నో టాపిక్‌ల మీద వాయిస్ మ్యూజింగ్స్ విడుదల చేసిన పూరి.. తాజాగా ‘రైల్వేస్టేషన్’ అనే టాపిక్ మీద మాట్లాడారు. రైల్వేస్టేషన్‌కు, సక్సెస్‌కు ఉన్న లింక్‌ను పూరి చాలా పర్ఫెక్ట్‌గా, క్లియర్‌గా చెప్పేశారు. తన దృష్టిలో సక్సెస్‌ఫుల్ పీపుల్ ఎవరో, ఎలా ఉంటే పీపుల్ సక్సెస్ అవుతారో.. అని పూరి చెప్పినది వింటే అందరూ హ్యాట్సాఫ్ అనాల్సిందే. 


‘‘మనందరం రైల్వేస్టేషన్‌లో ఎదురు చూస్తుంటాం. మనం ఎక్కవలసిన ట్రైన్ ఎప్పుడు వస్తుందా అని. అందరి ట్రైన్స్ వస్తుంటాయి. అందరూ ఎక్కి వెళ్లిపోతుంటారు. చాలా బాధగా ఉంటది. రోజులు గడుస్తున్నా మన ట్రైన్ రాదు. కానీ ఏదో ఒక రోజు మన ట్రైన్ వస్తుంది. అలా వచ్చేసరికి మనం చేయాల్సిన పని ఏంటంటే.. ఫ్లాట్‌ఫామ్ మీద ఉండటం. చాలా మంది ట్రైన్ కోసం చూసి చూసి ఫ్లాట్‌ఫామ్ వదిలి వెళ్ళిపోతారు. అలా వెళ్లొద్దు. ఫ్లాట్‌ఫామ్ మీదే ఉండండి. అక్కడే ఆడుకోండి. అసలు మనము ఎక్కాల్సిన ట్రైన్ రాకముందే మన కోచ్ పోతే పోనివ్వండి. అక్కడే ఉంటూ, ఫ్లాట్‌ఫామ్ మీద ఆడుకుంటూ చనిపోయే వాళ్లంటే నాకిష్టం. సక్సెస్ అంటే సార్ అవ్వడం కాదు. మీకిష్టమైన పనికోసం ఇష్టంగా చావడమే సక్సెస్ అంటే. నా దృష్టిలో వాళ్లే సక్సెస్‌ఫుల్ పీపుల్. మనం స్టార్ కాలేకపోవచ్చు. పేపర్‌లో మన ఫోటో పడకపోవచ్చు. ఒకవేళ నువ్వు ఎక్కాల్సిన ట్రైన్ ముందే వచ్చేసింది. నువ్వు ఎక్కేశావ్. ఎక్కడికెళ్తావ్. వేరే స్టేషన్‌లో, వేరే ఫ్లాట్‌ఫామ్ మీద దిగాల్సిందే కదా? అక్కడ చేయాల్సిన పనేంటి? ఆడుకోవడమే. మన వర్క్‌ని ఎంజాయ్ చేస్తూ బతకగలిగితే ఎక్కడైనా ఒకటే. మద్రాస్, ఢిల్లీ ఏదైనా ఒకటే. బట్ ఇలా బతకాలనుకుంటే మాత్రం కీప్ యువర్ సోల్ ఫ్రీ..’’ అని పూరి పేర్కొన్నారు. 

 


Follow Us on:
Advertisement
 
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.