అది పేరులేని రైల్వే స్టేషన్... కారణమిదే!

ABN , First Publish Date - 2022-06-05T16:39:36+05:30 IST

మన దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ ఒకటుందని...

అది పేరులేని రైల్వే స్టేషన్... కారణమిదే!

మన దేశంలో పేరు లేని రైల్వే స్టేషన్ ఒకటుందని మీకు తెలుసా? అది అసంభవం అని అనుకుంటున్నారా? కాదు అది నిజమే.. పశ్చిమ బెంగాల్‌లోని బుర్ద్వాన్‌ పరిధిలో ఈ పేరులేని రైల్వే స్టేషన్ ఉంది. ఈ రైల్వే స్టేషన్ నగరానికి 35 కిలోమీటర్ల దూరంలో రైనా అనే గ్రామంలో ఉంది. ఇది 2008లో నిర్మితమయ్యింది. అప్పటి నుండి ఈ స్టేషన్‌కు పేరనదే లేదు. 


2008కి ముందు ఈ స్టేషన్‌ని రైనానగర్‌గా పిలిచేవారు. రెండు గ్రామాల మధ్య విభేదాలే ఈ రైల్వే స్టేషన్‌కు పేరు లేకపోవడానికి కారణంగా నిలిచింది. రైనా, రైనానగర్ మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఈ స్టేషన్ రైనా గ్రామపు భూభాగంలో ఉంది. అయినా దీనికి రైనానగర్ అనే పేరు పెట్టారు. దీంతో ఇరు గ్రామల మధ్య గొడవ మొదలైంది. ఈ నేపధ్యంలో రైల్వే స్టేషన్‌లో ఉన్న నేమ్‌ బోర్డును తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్టేషన్‌కు పేరనేదే లేకుండా పోయింది. అయితే ఈ స్టేషన్‌లో రైనానగర్ పేరుతోనే టిక్కెట్లు ఇస్తారు.

Updated Date - 2022-06-05T16:39:36+05:30 IST