Clips: రైలుపట్టాలపై క్లిప్పుల తొలగింపు

ABN , First Publish Date - 2022-08-04T16:40:10+05:30 IST

రైలుపట్టాలపై క్లిప్పులు తొలగించి ఉండడాన్ని అధికారులు సకాలంలో గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. తిరుత్తణి సమీపంలో పొరుగు రాష్ట్రాలకు వె

Clips: రైలుపట్టాలపై క్లిప్పుల తొలగింపు

                                 - సకాలంలో గుర్తించిన అధికారులు


పెరంబూర్‌(చెన్నై), ఆగస్టు 3: రైలుపట్టాలపై క్లిప్పులు తొలగించి ఉండడాన్ని అధికారులు సకాలంలో గుర్తించడంతో పెనుప్రమాదం తప్పింది. తిరుత్తణి సమీపంలో పొరుగు రాష్ట్రాలకు వెళ్లే రైలు మార్గంలో మంగళవారం రాత్రి రైల్వే పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఆ సమయంలో ఐదు ప్రాంతాల్లో రైలు మార్గంపై పట్టాలు, చెక్కలకు అనుసంధానం చేసేలా ఏర్పాటుచేసిన క్లిప్పులు(Clips) తొలగించి ఉండడాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ మార్గంగా రైళ్లు వెళ్లకపోవడంతో పెనుప్రమాదం(Big accident) తప్పింది. అనంతరం రైల్వే కార్మికులు మరమ్మతుపనులు చేపట్టగా, ఈ వ్యవహారంలో ఎవరిదైనా హస్తం ఉందా కోణంలో రైల్వే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Updated Date - 2022-08-04T16:40:10+05:30 IST