మోచర్ల వద్ద కోతకు గురైన రైల్వే ట్రాక్‌

ABN , First Publish Date - 2020-11-30T03:48:41+05:30 IST

ప్రకాశం జిల్లా తెట్టు రైల్వే స్టేషన్‌, మోచర్ల గ్రామాల మధ్య రైల్వే లైన్‌ నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కోతకు గురైంది.

మోచర్ల వద్ద కోతకు గురైన రైల్వే ట్రాక్‌
మోచర్ల వద్ద కొట్టుకుపోయిన రైల్వే ట్రాక్‌ను మరమ్మతులు చేయిస్తున్న రైల్వే సిబ్బంది

యుద్ధప్రాతిపదికన మరమ్మతులు 

గుడ్లూరు, నవంబరు 29 : ప్రకాశం జిల్లా తెట్టు రైల్వే స్టేషన్‌, మోచర్ల గ్రామాల మధ్య రైల్వే లైన్‌ నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన భారీ వర్షాలతో కోతకు గురైంది. వెంటనే గుర్తించిన అధికారులు ఆదివారం యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేయించారు. మూడో లైను నిర్మాణ  పనుల్లో భాగంగా రైల్వే లైన్‌కు కొన్నిచోట్ల మట్టితో లైనింగ్‌ పనులు చేయించారు. మోచర్ల సమీపంలో కూడా ఈ విధంగా చేసి ఉండగా ప్రస్తుత వర్షాలకు కోతకు గురైంది. పట్టాల కింద కూడా మట్టి కొట్టుకుపోయే ప్రమాదం పొంచి ఉందని గుర్తించిన రైల్వే అధికారులు వంద మంది కూలీలను ఏర్పాటు చేసి మరమ్మతులు చేయించారు.  రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగనప్పటికీ ఈ రూటులో డిసెంబరు 1 నుంచి పలు రైళ్లు తిరగనున్నాయి. 

Updated Date - 2020-11-30T03:48:41+05:30 IST