ఇక రైలు మేనేజర్లుగా Train Guards...రైల్వేబోర్డు ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-01-15T14:13:25+05:30 IST

రైలు గార్డులను ఇకనుంచి ‘ట్రైన్ మేనేజర్లు’గా పిలవాలని రైల్వే బోర్డు నిర్ణయించింది....

ఇక రైలు మేనేజర్లుగా Train Guards...రైల్వేబోర్డు ఉత్తర్వులు

న్యూఢిల్లీ: రైలు గార్డులను ఇకనుంచి ‘ట్రైన్ మేనేజర్లు’గా పిలవాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అయితే అధికారిక ఆర్డర్ ప్రకారం రైలు మేనేజర్ల వర్క్ ప్రొఫైల్ , పే గ్రేడ్‌ను అలాగే ఉంచుతారు.రైలును సురక్షితంగా నడిపే బాధ్యత కల గార్డుల హోదాను మార్చాలన్నది రైల్వే ఉద్యోగుల సంఘాల చిరకాల డిమాండ్ అని అధికారులు తెలిపారు.గార్డులను ‘రైలు మేనేజర్లుగా’ రీ డిజిగ్నేేట్ చేస్తూ రైల్వే బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.అసిస్టెంట్ గార్డ్‌ను అసిస్టెంట్ ప్యాసింజర్ రైలు మేనేజరుగా, సీనియర్ ప్యాసింజర్ గార్డ్‌ను సీనియర్ ప్యాసింజర్ రైలు మేనేజరుగా మార్చారు.రైల్వే బోర్డు ఛైర్మన్ పదవిని సీఈవో అని జోడించిన తర్వాత రైల్వేలు కార్పొరేట్ ఇమేజ్ మేకోవర్‌ను సంతరించుకున్నాయి.


రైళ్లను నడపడానికి ప్రైవేట్ వాళ్లను అనుమతించాలని రైల్వేలు యోచిస్తున్నందున, నామకరణంలో ఈ మార్పులు సహజమైనవి. దానికి అనుగుణంగానే రైల్వేల ఆధునికీకరణ చేస్తామని అధికారులు తెలిపారు. ట్రైన్స్ గార్డుల ప్రస్తుత హోదాను రైలు మేనేజర్లుగా మార్చడం వల్ల గౌరవప్రదమైన హోదాగా ఉంటుంది. తద్వారా వారు సమాజంలో గౌరవప్రదమైన జీవితాన్ని కూడా గడపవచ్చని ఒక రైల్వే అధికారి చెప్పారు.


Updated Date - 2022-01-15T14:13:25+05:30 IST