ఎడతెరిపి లేని వర్షం.. జన జీవనం అస్తవ్యస్తం

ABN , First Publish Date - 2020-11-26T05:30:00+05:30 IST

నివర్‌ తుఫాన్‌ కారణంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలన్నీ నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఎడతెరిపి లేని వర్షం.. జన జీవనం అస్తవ్యస్తం
కనిగిరి మండలంలో నీట మునిగిన మినుము / ప్రవహిస్తున్న ఎర్ర వాగు


నీట మునిగిన వరి, మినుము, మిర్చి, శనగ పంటలు

నివర్‌పై రైతుల్లో ఆందోళన

కనిగిరి, నవంబరు 26 : నివర్‌ తుఫాన్‌ కారణంగా ఎడతెరపి లేని వర్షాలు కురుస్తున్నాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలన్నీ నీట మునగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కనిగిరి ప్రాంతంలో సాగులో ఉన్న మెట్ట పైర్లు దెబ్బ తిన్నాయి. వ్యవసాయ అధికారుల సూచనలతో మెట్ట పంటలు విస్తారంగా సాగు చేశారు. పంటల దిగుబడి బాగా వస్తుందనుకున్న తరుణంలో అకాల వర్షాలతో పంటలు నీట మునిగి పూర్తిగా నష్టం వాటిల్లింది. బుధవారం రాత్రి నుంచి కురిసిన వర్షాలకు కంది, మినుము బొబ్బర, వరి, శనగ, పంటలకు నష్టం వాటిళ్లింది. కనిగిరి మండలంలో తక్కెళ్లపాడు, హజీస్‌పురం, లింగారెడ్డిపల్లి, వంగపాడు, గురవాజీపేట, చాకిరాల, తుమ్మ గుంట, తాళ్లూరు తదితర గ్రామాల పరిధిలోని కంది, మినుము, శనగ, బొబ్బర్లు, వరి పంటలు నీట మునిగాయి. మినుము పంట కోత సమ యానికి పడిన వర్షంతో గింజ కుళ్లిపోయింది.

పామూరు : మండలంలోని పలు గ్రామాల్లో కంది, మినుము, శనగ, జొన్న పంటలతో పాటు వ్యవసాయ మోటార్ల కింద వరి పంటను సాగు చేశారు. మెట్టపంటను పూత, కాయ దశలో వస్తున్న తరుణంలో వరుసగా వచ్చిన తుఫాన్ల ప్రభావంతో భారీ వర్షాలు కురవడంతో మెట్ట పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు పొలాల్లో నీరు నిలబడటం వలన శనగ పైరు చచ్చిపోయింది. మినుము కాయ దశలో ఉండగా వర్షానికి తడిసి కాయలు కుళ్లిపోయాయి. కంది పంట పూత దశలో ఉండగా వర్షం ధాటికి పూత రాలి పోయింది. మండలంలోని బోడవాడ, దాదిరెడ్డిపల్లి, వగ్గంపల్లి గ్రామాల్లో మెట్ట పంట వేసిన రైతులు పూర్తిగా నష్టపోయారు. లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. 

సీఎస్‌పురం :  మండలంలో గురువారం భారీ వర్షం కురిసింది. పెద్ద ఎత్తున ఈదురు గాలులు వీస్తుండంతో చలికి ప్రజలు ఎవరూ బయటకు రాలేదు. రోడ్లన్నీ జలమయమయ్యాయి.  మినుము పంటకు నష్టమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి ఓదెలు నీట మునిగాయి.   స్తంభం నేలకూలి విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

హనుమంతునిపాడు :  ఎర్రవాగు, ఏనుగుమందవాగులు పొంగి పొ ర్లాయి. వేములపాడు, గాయంవారిపల్లి, ముక్కువారిపల్లి, హనుమంతుని పాడు, సీతారామపురం తదితర గ్రామాల్లో వేసిన మెట్ట పంటల్లో నీరు చేరి రైతులకు ఆర్ధిక నష్టం చేకూర్చింది. 

వెలిగండ్ల : మండలంలో కురిసిన వర్షానికి శనగ పంట నీట మునిగింది.  సాగులో ఉన్న మెట్ట పంటలు నీట మునిగాయి.  51.0 మి.మీ వర్షపాతం నమోదైటన్లు అధికారులు తెలియజేశారు. గన్నవరం, అగ్రహారం, మోటుపల్లి వెదుళ్ల చెరువు, రాళ్లపల్లి, పందువ గ్రామాల్లో మినుము పంటను కోత కోసి పొలంలోనే ఉంచడంతో పంట మొత్తం తడిసి పోయింది. కోయాల్సిన పంట కూడా తడిచిపోయిందిని రైతులు ఆవేదనఽ వ్యక్తం చేస్తున్నారు.

పీసీపల్లి : మండలంలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది.  కోతకు వచ్చిన వరి కయ్యల్లోనే నేలమట్టమైంది. దీంతో పక్వానికి వచ్చిన పిందెలు తడిసి నీటిలో ముగినిపోయాయి. వరి, మినుము రైతులకు నివర్‌ దెబ్బకొట్టింది.  

దర్శి : దర్శి ప్రాంతంలో  గురువారం ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షంతో బోర్లకింద సాగు చేసిన వరిపంట నేలకొరిగింది. కోతదశకు వచ్చిన వరిపంట పడిపోవటంతో వేలాది రూపాయలు పెట్టుబడులు నష్టపోవాల్సి వచ్చిందని రైతులు వాపోతున్నారు. మెట్ట ప్రాంతాల్లో సాగు చేసిన మిర్చి, పత్తి, పొగాకు పంటలు కూడా దెబ్బతిన్నాయి. పొగాకు కొట్టి పలు గ్రామాల్లో పందిళ్లల్లో ఆరబెట్టారు. కోసిన ఆకు పండిన ఆకు పూర్తిగా మడ్డి కారిపోయింది. పత్తి పంట కాయతీస్తున్నందున తడవటంతో రంగుమారే ప్రమాదం నెలకొంది. మిర్చి తోటలు ఉరకెత్తి దెబ్బతింటాయని రైతులు ఆందోళనలు చెందుతున్నారు.  

కురిచేడు:   సాగర్‌ ఆయకట్టు, బోరు బావుల కింద సాగుచేసిన బీపీటీ రకం వరి పైరు నేలవాలుతున్నది.  

ముండ్లమూరు: మండలంలో పసుపుగల్లు, పెదఉల్లగల్లు, సింగన్నపాలెం, కెల్లంపల్లి, వేముల, రెడ్డినగర్‌, ముండ్లమూరు, చంద్రగిరి, తమ్మలూరు, కమ్మవారిపాలెం, పులిపాడు గ్రామాల్లో రైతులు వ్యవసాయ బోర్ల కింద బీపీటీ రకం వరి పంట నేలవాలింది. ముండ్లమూరు - వేంపాడు మధ్య ఉన్న చిలకలేరువాగును అధికారులు పరిశీలించారు. 

దొనకొండ: మండలంలో కురుస్తున్న వర్షంతో కోసి ఆరబెట్టిన మిర్చి రంగు మారుతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. మరికొన్ని గ్రామాల్లో చేతికొచ్చిన  మిరప పంట నేలవారింది. పత్తిపంట కాయపగిలి రంగు మారుతుందని రైతులు పేర్కొన్నారు. గంగదేవిపల్లె గ్రామంలో  బొర్రెడ్డి సుబ్బమ్మ, కర్నాటి వెంకటశేషారెడ్డికి చెందిన పొగాకు బ్యార్ని గోడ  కూలింది. దీంతో గోడ పక్కన కట్టేసిన గేదెకు గాయాలయ్యాయి.

తాళ్లూరు: మండలంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి.  వరి పంట నేలవాలింది. బొప్పాయి, మిరపతోటలు వర్షపు నీటితో నిండిపొయాయి. నాగంబొట్లపాలెం, తూర్పుగంగవరం గ్రామాల్లో కోసిన వరిఓదెలు తడిశాయి. తాళ్లూరు-విఠలాపురం మార్గంలో గల దోర్నపువాగు వంతెన పైగుండా నీరు ప్రవహిస్తున్నది. 

పొదిలి   : తుఫాన్‌ కారణంగా పొదిలిలో గురువారం ఎడతెరపి లేకుం డా వర్షం కురిసింది. జనజీవనానికి ఆటంకం ఏర్పడింది. ప్రధాన రహదారులన్నీ జలమయమయ్యాయి.పట్టణంలోని విశ్వనాఽథపురం, పాతూరులో పలుప్రాంతాలలో మట్టి రోడ్లు  ఛిద్రమై నడవడానికి కూడా వీలు లేకుం డా పోయాయి. శివారు కాలనీలైన టైలర్స్‌ కాలనీ, బాప్టి్‌స్టపాలెం, పిచ్చిరెడ్డితోట, విశ్వబ్రాహ్మణ కాలనీ తదితర ప్రాంతాలలోని అంతర్గత రహదారులు అధ్వానంగా తయారయ్యాయి. దీనికి తోడు  తరచూ విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో ప్రజలు అవస్థలు పడ్డారు. కురుస్తున్న వర్షం వల్ల మినుము, బొబ్బర్లు వేసిన రైతులు ఆందోళన చెందుతున్నారు.

ఉధృతంగా ప్రవహిస్తున్న భైరవకోన జలపాతం 

ప్రముఖ పర్యాటక శైవక్షేత్రం భైరవ కోన జలపాతం భారీ వర్షానికి ఉధృ తంగా ప్రవహిస్తోంది. త్రిముఖ దుర్గాంభాదేవి ఆల యం లోపలి నుంచి నీరు ప్రవహించింది. ఈ ఏడాది జలపాతం ఉధృతంగా ప్రవ హించడం ఇది నాలుగవసారి. భైరవకోన వంకలు పొంగి పొర్లుతున్నాయి.  పంచాుఽతీ రాజ్‌ అతిథిగృహం వెనుక కొండలపై నుం చి భారీగా వరద నీరు ప్రహిస్తోంది.  జల పాతం  వద్దకు పర్యాటకులు ఎవరూ రావ ద్దని ఎస్‌ఐ చుక్కా శివబసవరాజు సూచిం చారు. అక్కడ పోలీస్‌ సిబ్బంది బందోబస్తు నిర్వహిస్తున్నారు. 









Updated Date - 2020-11-26T05:30:00+05:30 IST