Advertisement

వీడని ముసురు..!

Nov 29 2020 @ 22:53PM
వాహనదారుల కష్టాలు

ఆత్మకూరు, నవంబరు 29 : నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురిసిన వర్షాలతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురయ్యారు. వాగులు వంకలు, చెరువులు పొర్లిపొంగాయి. చెరువులు జలకళను సంతిరించుకున్నా యి. ఆత్మకూరు, అనంతసాగరం లాంటి పెద్ద చె రువులు అలుగుపారాయి. తుఫాన్‌ ప్రభావం త గ్గుముఖం పట్టడంతో ఆదివారం జలదిగ్బంధం లో చిక్కిన పలుగ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ ముసురు వీడకపోవడంతో పా టు ఉదయం నుంచి ఓ మోస్తరు వర్షం కురుస్తుండడంతో ప్రజలు బయటకు రాలేకపోయారు. రో డ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నీటమునిగిన వరినారుమ ళ్లు బయట పడకపోవడంతో రైతులు ఆవేదనలో ఉన్నారు. ఆత్మకూరు నియోజకవర్గంలో సుమారు లక్ష ఎకరాల పైలచిలుకు వరి, పత్తి, వేరుశనగ, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. ఆక్వా గుంటలు నీటమునిగాయి. 

కన్నీరు మిగిల్చిన ‘నివర్‌‘

ఉదయగిరి రూరల్‌: నివర్‌ తుఫాన్‌ మెట్ట రైతులకు కన్నీళ్లు మిగిల్చింది. ఎడతెరిపి లేకుం డా కురుస్తున్న వర్షాలకు సాగులో ఉన్న పంట లు పూర్తిగా దెబ్బతిన్నాయి. దుత్తలూరు మండలంలోని బండకిందపల్లి గ్రామంలో రైతులు సాగు చేసిన మిర్చి పంటలోకి నీరు చేరడంతో వాటిని బయటకు పంపేందుకు రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి సాగు చేసిన పంట వారి కళ్లెదుటే నాశనమవుతుండడంతో కన్నీటి పర్యాంతమవుతున్నారు. నివర్‌ తుఫాన్‌ ప్రభావంతో కురుస్తున్న వర్షం వీడకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. రహదారులు ఛిద్రమై రాకపోకలు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వర్షంతో మండలంలోని అన్ని చెరువుల్లో 80 శాతం మేరకు నీరు చే రగా, కొన్ని చెరువులు అలుగులు పారుతున్నాయి. వర్షం ఇలాగే కొనసాగితే చెరువులు ప్రమాదస్థాయికి చేరుకొనే అవకాశాలున్నాయి. 

ఆగని వర్షం - తగ్గని వరద

కలిగిరి: నివర్‌ తుఫాన్‌ తీరందాటి మూడురోజులవుతున్నా ఆ  ప్రభావం నుంచి మండల వాసులకు క ష్టాలు మాత్రం తొలగలేదు. మళ్లీ రెండు వాయుగుండాలు ముంపు పొంచి ఉన్నదని తెలియడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎక్కడికక్కడ పంటపొలాల్లో నీరు నిల్చి ఉంది. కలిగిరి- కొండాపురం మార్గంలో కలిగిరి సమీపంలో చప్టాపై నీరు ప్రవహిస్తుండటంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఆదివారం వర్షం మొదలవడంతో మెట్టపంటలపై పూర్తిగా ఆశలు వదుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

నట్టేట ముంచిన తుఫాన్‌            

సీతారామపురం: నివర్‌ తుఫాన్‌ అన్నదాతలను నట్టేట ముంచింది. పంటను కాపాడుకునేందుకు ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా రైతులకు నష్టం తప్పడం లేదు. పలు గ్రామాల్లో వరి పంట నీట మునిగింది. చాలా చోట్ల కోసిన వరి పనలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. మరి కొన్ని చోట్ల మొలకలు వచ్చేశాయి. మండల వ్యాప్తం గా 40 హెక్టార్లలో వరి, 70 హెక్టార్లలో మినుము, 5 హెక్టార్లలో మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లినట్టు అధికారుల అంచనా. చలిగాలులకు 76 గొర్రెలు, 103 మేకలు మృత్యువాత పడ్డాయి. 

వర్షపునీటిలో దివ్యాంగుల కాలనీ

కావలి: పట్టణంలోని ముసునూరు దివ్యాంగు ల కాలనీ వర్షపునీటిలోనే ఉన్నా అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. నాలుగు రోజులుగా ఆ కాలనీ నీటిలో మునిగి ఇళ్లలోకి కూడా వర్షపు నీరు వచ్చి ఉండటంతో అక్కడ ఇళ్లలో వంటకూడా చేసుకోలేక పస్తులుండాల్సిన పరిస్థితి ఏర్పడిందని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటితో కాలనీ మునిగి పోయిన విషయంను స్థానిక సచివాలయంలో కార్యదర్శులకు చెప్పగా వారు వైసీపీకి చెందిన నాయకులు చెబితే అక్కడ నీరు తొలగిస్తామని, మీరు చెపితే తాము చేయమని చెబుతున్నారని దివ్యాంగులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి దివ్యాంగుల కాలనీలో నీటిని తొలగించేందుకు ప్రయత్నాలు చేపట్టాలని కోరుతున్నారు.

రోడ్డుకు గండి

పట్టణంలోని వెంగళరావునగర్‌ కొత్త శివాల యం ప్రాంతం నుంచి ముసునూరు కాలనీలకు వెళ్లే తారు రోడ్డు కు భారీ గండి పడింది. దీంతో కాలనీలకు రాకపోకలు బందయ్యాయి. అధికారులు స్పం దించి తక్షణం ఆ గండిని పూడ్చి రాకపోకలు పునరుద్ధరణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

భయం గుప్పెట్లో రైతులు

వరికుంటపాడు: నివర్‌ తుఫాన్‌ రైతులపై పెనుభా రం మోపింది. వర్షం తాకిడి తగ్గినప్పటికీ ఆదివారం సైతం వరద నీరు రిజర్వాయర్లు, చెరువులకు చేరుతూనే ఉంది. దీంతో మండలంలోని నక్కలగండి, సమీప ఉదయగిరి మండలం గండిపాళెం రిజర్వాయర్లు అలుగు పారడంతోపాటు క్రస్ట్‌గేట్లు ఎత్తే అవకాశం ఉండడంతో లోతట్టు ప్రాంతాల రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పొలాలకు సమీపంలోని వాగులు, వంకల్లో ఏర్పాటు చేసుకొన్న విద్యుత్‌ మోటార్లను సురక్షితంగా తరలించే పనుల్లో నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకొన్న తూర్పుబోయమడగల, అలివేలుమంగాపురం, జడదేవి, తూర్పుచెన్నంపల్లి తదితర గ్రామాల రైతులు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా తడుస్తూనే విద్యుత్‌ మోటార్లనైనా దక్కించుకోవాలనే అత్రుతతో పరుగులు తీసి వాటిని ఒడ్డుకు చేర్చుకొంటున్నారు. 

తుఫాన్‌ పోయినా వదలని వర్షం

బిట్రగుంట: బోగోలు మండలాన్ని నివర్‌ తుఫాన్‌ నీట మంచి తీరం దాటి మూడు రోజులు గడుస్తున్నా ఇంకా వర్షం కురుస్తుండటం వలన ముంపు గ్రామాలు బిక్కు బిక్కు మంటున్నాయి. తెల్లగుంట, అల్లిమడుగు, ఉమామహేశ్వరపురం గ్రామాల ప్రజలు వరద నీరు నిల్వ ఉండి ఎటూ వెళ్లలేక జలదిగ్బంధంలో ఉన్నారు. ఇప్పటికే 260 మందిని పునరావాస కేంద్రాలకు తరలించగా కొందరు వరద నీటిలో కాలం గడుపుతున్నారు. ట్రాక్టర్‌ తప్ప మరే వాహనం వెల్లేందుకు సాహసించని గ్రామాల్లో తిండి, నీరు లేక అవస్థలు పడుతున్నారు.

 
దెబ్బతిన్న బండారుపల్లి రోడ్డు


నేల వాలిన వరి పైరు


ఉమామహేశ్వరపురంలో నీటిలో ఇల్లు


ఒడ్డుకు విద్యుత్‌ మోటార్లు


మిర్చి పంటలో వర్షపు నీరు


ఇందిరమ్మకాలనీకి రోడ్డుకు గండి


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.