రైల్వేకోడూరులో వర్షం

ABN , First Publish Date - 2020-12-04T04:31:51+05:30 IST

తుఫాన్‌ ప్రభావంతో రైల్వేకోడూరులో గురువారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురిసింది. నదీ పరీవాహక ప్రాంతాలవారు ఇబ్బంది పడ్డారు.

రైల్వేకోడూరులో వర్షం
ప్రవహిస్తున్న గుంజన నది

రైల్వేకోడూరు, డిసెంబరు, 3: తుఫాన్‌ ప్రభావంతో రైల్వేకోడూరులో గురువారం తెల్లవారుజామున నుంచి భారీ వర్షం కురిసింది. నదీ పరీవాహక ప్రాంతాలవారు ఇబ్బంది పడ్డారు. ప్రధానంగా  నరసరాంపేట, ధర్మాపురం, దొమ్మరిళ్లు, చిన్నలాలాపేట తదితర ప్రాం తాల్లో ఉన్న ప్రజలు ముంపునకు గురయ్యే అవకాశాలు ఉన్నా యని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. కాగా రాత్రికి వర్షం ఎక్కువ పడే అవకాశం ఉందని, నదుల వద్దకు ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.

Updated Date - 2020-12-04T04:31:51+05:30 IST