
అమరావతి: నైరుతి బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడింది. చెన్నైకి ఆగ్నేయంగా 310 కి.మీ. దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైంది. చెన్నై సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో రాయలసీమలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది. పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దక్షిణ కోస్తాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.