వర్షానికి కూలిన ఇళ్లు

Jul 23 2021 @ 00:10AM
మర్పల్లి మండలం పంచలింగాల్‌లో కూలిన ఇంటి వద్ద యజమాని అంజయ్య

తాండూరు రూరల్‌/కులకచర్ల/ధారూరు/మర్పల్లి : వర్షానికి తాండూరు రూరల్‌ మండల పరిధిలోని మంబాపూర్‌లో మూడు ఇండ్లు కూలిపోయాయి. నారాయణపూర్‌ గ్రామంలో మహిపాల్‌రెడ్డి, జి.బాలమ్మఇండ్లు బుధవారం రాత్రి కూలిపోయాయి. అదేవిధంగా బసవలింగం ఇల్లు పాక్షికంగా కూలింది. ప్రభుత్వ పరంగా పరిహారం అందించాలని బాధితులు కోరుతున్నారు. కులకచర్ల పరిధిలోని చౌడాపూర్‌ మండలం మక్తవెంకటాపూర్‌లో చాందీబాయి, బోట్యనాయక్‌ల ఇండ్లు కూలిపోయాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకోవాలని సర్పంచ్‌ అనిత తెలిపారు. ధారూరు మండల పరిధిలోని నాగసమందర్‌ గ్రామంలో ఎంకేపల్లి హంసమ్మ ఇల్లు వెనుకవైపు గోడ తడిసి కొంతభాగం కూలిపోయింది. మర్పల్లిలోని వివిధ గ్రామాల్లో వర్షం తాకిడికి ఆరు ఇండ్లు కూలిపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మర్పల్లి మండల కేంద్రానికి చెందిన శ్రీనివాస్‌, పంచలింగాల్‌కు చెందిన లక్ష్మయ్య, వీర్లపల్లి గ్రామానికి చెందిన గోపాల్‌రావు, కల్కోడ గ్రామానికి చెందిన సంగీత, కొంశెట్‌పల్లి గ్రామానికి చెందిన అంజయ్యల ఇండ్లు, ఇతరులకు చెందిన మరో ఇల్లు కూలిపోవడంతో వారంతా నిరాశ్రయులయ్యారు. ఇంటి పైకప్పులు కూలి తీవ్ర నష్టం వాటిల్లిందని వాపోయారు. ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

Follow Us on: