Assam లో వరదల ఉగ్రరూపం.. 25 మంది మృత్యువాత.. 31 లక్షల మందిపై ప్రభావం.. ముంపులో 4,291 గ్రామాలు

ABN , First Publish Date - 2022-06-19T15:12:09+05:30 IST

నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంలో విలయం సృష్టిస్తున్నాయి. శనివారం కురిసిన భారీ వర్షాలకు మరో 8 మంది బలయ్యాయి. దీంతో

Assam లో వరదల ఉగ్రరూపం.. 25 మంది మృత్యువాత.. 31 లక్షల మందిపై ప్రభావం.. ముంపులో 4,291 గ్రామాలు

దిస్పూర్ : నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంను అతలాకుతలం చేస్తున్నాయి. శనివారం కురిసిన నమోదయిన భారీ వర్షాలతో వరదలు ఉగ్రరూపం దాల్చాయి. దీంతో మరో 8 మంది నమోదయ్యాయి. దీంతో అక్కడ వరదల మృతుల సంఖ్య 25కు పెరిగిందని అసోం అధికారులు ప్రకటించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. మరో 8 మంది ఆచూకీ గల్లంతయ్యింది. బజాలి, కబ్రీ అంగ్‌లాండ్ వెస్ట్, కాక్రఝర్, తముల్పూర్ జిల్లాలో వరదల తీవ్రత అధికంగా ఉంది. మొత్తం 32 జిల్లాలోని 31 లక్షల మంది అసోం వాసులపై వరదలు తీవ్ర ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తున్నాయని అధికారులు వివరించారు. వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. బ్రహ్మపుత్ర నది, దాని ఉపనదుల వదరల్లో మొత్తం 4,291 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. 66455.82 హెక్టార్ల మేర పంట నీట మునిగింది. కాగా అసోం వరదల విలయంపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. అసోం సీఎం హిమంత్ బిశ్వాతో గురువారం ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి అండగా ఉంటామని ఆయనకు భరోసా ఇచ్చారు.


సురక్షిత ప్రాంతాలకు రాలేమంటున్న బాధితులు..

ఒక వైపు వరదలు చుట్టుముడుతున్నా ఇళ్లను వీడి సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లేందుకు అసోం వాసులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం సహాయక చర్యల్లో ఇబ్బందికరంగా మారిందని అధికారులకు తెలిపారు. ఇంట్లో విలువైన వస్తువులు ఉన్నాయని, వాటిని వదిలేసి రాలేమని బాధితులు చెబుతున్నారు. అయితే నచ్చజెప్పి కొంతమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగామని అక్కడి పరిస్థితిని అధికారులు వెల్లడించారు.


బాధితుల కోసం సరిపడా ఆహార పదార్థాలను సంసిద్ధం చేశామని వివరించారు. పక్కనే ఉన్న భూటాన్‌లో వరదల తీవ్రత ఎక్కువగా ఉండడంతో రానున్న రోజుల్లో  అసోంలో పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉందని డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ అధికారి బర్పెటా  ఆందోళన వ్యక్తం చేశారు. కాగా వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో అసోంలో ఈ ఏడాది మొత్తం 62 మంది చనిపోయారు.

Updated Date - 2022-06-19T15:12:09+05:30 IST