హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

ABN , First Publish Date - 2021-08-14T23:38:15+05:30 IST

నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్

హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో వర్షం

హైదరాబాద్: నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఫిలింనగర్‌, మాసబ్ ట్యాంక్, ఖైరతాబాద్, నాంపల్లి, పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్‌లో వర్షం పడింది. రోడ్ల మీద వర్షపు నీరు నిలిచిపోయింది. పలుచోట్ల లోతట్టు ప్రాంతాలు పొంగిపొర్లాయి.  డ్రైనేజీలు పొంగడంతో మురుగు రోడ్లపై చేరింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. దీంతో డీఆర్‌ఎఫ్‌, మాన్‌సూన్‌ ఎమర్జెన్సీ బృందాలు రంగంలోకి దిగాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ ప్రభావంతో రాష్ట్రంలో రాగల మూడు రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Updated Date - 2021-08-14T23:38:15+05:30 IST