హైదరాబాద్‌లో భారీ వర్షం

ABN , First Publish Date - 2022-03-19T23:21:28+05:30 IST

నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని

హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌: నగరంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. నగరంలోని పలు ప్రాంతాలలో వర్షం కురుస్తోంది. సైదాబాద్, సంతోష్ నగర్, రామంతాపూర్, చంపాపేట, మలక్ పేట, సరూర్ నగర్, ఎల్బీ నగర్, నాగోల్, హబ్సీగూడలలో వర్షం పడుతోంది. అలాగే గండి మైసమ్మ, షాపూర్ నగర్, జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉంది. దీంతో జీహెచ్‌ఎంసీ, డీఆర్‌ఎఫ్ బృందాలు రంగంలోకి దిగాయి. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఆఫీస్‌ల నుంచి ఇంటికి వెళ్ళే  సమయంలో భారీ వర్షం కురవడంతో వాహనదారులు అవస్థలు పడుతున్నారు.

Updated Date - 2022-03-19T23:21:28+05:30 IST