దంచికొట్టిన వాన

ABN , First Publish Date - 2022-10-07T04:53:30+05:30 IST

సిద్దిపేట జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్గల్‌ మండలంలో 98.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.

దంచికొట్టిన వాన
వర్గల్‌ మండలం నాచారం వద్ద ఉధృతంగా పారుతున్న హల్దీవాగు

జిల్లావ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్లు వర్షపాతం నమోదు

సిద్దిపేట పట్టణంలో కురుస్తున్న వర్షం


సిద్దిపేట అగ్రికల్చర్‌/వర్గల్‌, అక్టోబరు 6 : జిల్లాలో గురువారం మోస్తరు వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా 30.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వర్గల్‌ మండలంలో 98.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. వర్గల్‌ మండల వ్యాప్తంగా ఆయా గ్రామాల్లో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. మండలంలో చెరులువు, కుంటలు మత్తళ్లు దూకుతున్నాయి. వర్గల్‌ పెద్దచెరువు మత్తిడి పొంగిప్రవహిస్తున్నది. నాచారం హల్దీవాగు పరవళ్లు తొక్కుతున్నది. వర్షం ప్రభావంతో వర్గల్‌లో ప్రధాన రాహదారులు జలమయమైనాయి. వర్గల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట రహదారిపై వరద నీరు నిలిచి వాహన రాకపోకలకు ఇబ్బందులు ఎర్పడ్డాయి. ములుగు మండలంలో 88.2 మిల్లీమీటర్లు, రాయపోల్‌ మండలంలో 94.4 మిల్లీమీటర్లు, బెజ్జంకి 16.3, దౌల్తాబాద్‌ 38.4, కొండపాకలో 33.8, తొగుటలో 11.9, గజ్వేల్‌లో 37.8, అక్కన్నపేటలో 24.6, మర్కుక్‌ 21.1, మిరుదొడ్డిలో 21.1, చిన్నకోడూర్‌లో 22.1, కోహెడలో 11.8, దుబ్బాకలో 18.6, జగదేవ్‌పూర్‌లో 9.5, చేర్యాలలో 18.1 మిల్లీమీటర్లు మద్దూర్‌లో 25.5, నంగునూరులో 15.2, కొమురవెల్లిలో 22.3, సిద్దిపేట రూరల్‌లో 29.3, సిద్దిపేట అర్బన్‌ మండలంలో 34.0 మిల్లీమీటర్లు, మర్కుక్‌ మండలంలో 13.3, హుస్నాబాద్‌ మండలంలో 2.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లాలో పూత దశలో ఉన్న పత్తి పంటకు ఈ వర్షాలు జీవం పోసినట్లయింది.



Updated Date - 2022-10-07T04:53:30+05:30 IST