తిరుమలలో Rain

ABN , First Publish Date - 2022-05-16T01:29:51+05:30 IST

తిరుమల (Tirumala)లో ఆదివారం ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం (Rain) కురిసింది. వర్షం స్వల్పంగానే కురిసినప్పటికీ ఈదురు గాలులు భారీగా వీచాయి.

తిరుమలలో Rain

తిరుమల: తిరుమల (Tirumala)లో ఆదివారం ఉరుములు, మెరుపుతో కూడిన వర్షం (Rain) కురిసింది. వర్షం స్వల్పంగానే కురిసినప్పటికీ ఈదురు గాలులు భారీగా వీచాయి. దీనివల్ల దర్శనానికి వచ్చిన భక్తులు, ఘాట్లలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక తిరుమలలోని గరుడ గెస్ట్‌హౌస్‌ వద్ద ఓ భారీ వృక్షం మధ్యలోకి చీలి విరిగి రోడ్డుపై పడింది. పిడుగుపాటు వల్లే ఇలా జరిగిందని అక్కడున్నవారు భావిస్తున్నారు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో వాహనాలు, భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పిందంటున్నారు. 

Updated Date - 2022-05-16T01:29:51+05:30 IST