అపార నష్టం..!

ABN , First Publish Date - 2021-04-23T06:22:41+05:30 IST

జిల్లాలోని పలు ప్రాంతాల్లో గు రువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పిడుగులు పడ్డా యి. కళ్యాణదుర్గం ప్రాంతంలో గురువారం వడగండ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లు, గాలి బీభత్సానికి మామిడి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. వడగండ్ల తాకిడికి పంట దెబ్బతింది. చాపిరి గ్రామానికి చెందిన రైతు గోవర్ధన 5 ఎకరా ల్లో బొప్పాయి పంటను సాగు చేశాడు. సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షం, గాలి బీభత్సానికి 5 ఎకరాల్లో సాగు చేసిన పంట నేలకొరిగింది.

అపార నష్టం..!

ఈదురుగాలులు,

వడగళ్ల వానకు భారీగా పంట నష్టం

పలుచోట్ల పిడుగులు


అనంతపురం  వ్యవసాయం/కళ్యాణదుర్గం/కంబదూరు/ఉరవకొండ/అమడగూరు, ఏప్రిల్‌ 22:  జిల్లాలోని పలు ప్రాంతాల్లో గు రువారం ఈదురుగాలులతో కూడిన వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల పిడుగులు పడ్డా యి. కళ్యాణదుర్గం ప్రాంతంలో గురువారం వడగండ్లతో కూడిన ఓ మోస్తరు వర్షం కురిసింది. వడగండ్లు, గాలి బీభత్సానికి మామిడి, బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. వడగండ్ల తాకిడికి పంట దెబ్బతింది. చాపిరి గ్రామానికి చెందిన రైతు గోవర్ధన 5 ఎకరా ల్లో బొప్పాయి పంటను సాగు చేశాడు. సాయంత్రం కురిసిన వడగండ్ల వర్షం, గాలి బీభత్సానికి 5 ఎకరాల్లో సాగు చేసిన పంట నేలకొరిగింది. వడగండ్ల దెబ్బకు కాయలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దీంతో సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. గాలివాన దెబ్బ కు రైతు ఉషాగౌరికి చెందిన బొప్పాయి చెట్లు నేలకొరిగాయి. హులికల్లులో మొక్కజొన్న పంటదెబ్బతింది. చాపిరి ఉన్నత పాఠశాల ప్రహరీ నేలకూలింది. మల్లికార్జునపల్లి, గూబనపల్లి, దొడగట్ట, తిమ్మసముద్రం గ్రామా ల పరిధిలో ఈదురు గాలులకు మామిడికాయ లు నేలరాలాయి. పిడుగు పడి కురుబ రవికి చెందిన పాడి ఆవు మృతి చెందింది. దీంతో రూ.70 వేలు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్య క్తం చేశాడు. దొడగట్ట రైతు నాగరాజు పొలంలో వేపచెట్టు కుప్పకూలింది.

కంబదూరు మండలంలో గురువారం సాయంత్రం వీచిన ఈదురుగాలులు, వర్షానికి మామి డి కాయలు నేలరాలాయి. మండలంలోని జెల్లిపల్లి, నూతిమడుగు, ఐపార్శిపల్లి, రాంపురం పరిధిలో మామిడి కాయలు నేలరాలడంతో రైతులు లక్షలాది రూపాయలు నష్టపోయారు. మండలంలోని జెల్లిపల్లికి చెందిన మహేష్‌ నాలుగు ఎకరాల్లో సు మారు 400 చెట్లు సాగు చేశాడు. కోత దశలో ఉం డడంతో కాయలన్నీ నేలరాలాయి. దీంతో సుమారు రూ.2 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని తెలిపారు. రాళ్లపల్లిలో ఇంటి గోడలు కూలిపడ్డాయి. నూతిమడుగులో రైతు అబ్దుల్లాకు చెందిన రూ.4 లక్షల విలువైన  120 మామిడిచెట్లు నేలకొరిగాయి. స్థానిక కోట కాలనీలో కట్ట వెంకటేశులుకు చెందిన ఆవు పిడుగు పాటుకు మృతి చెందింది. సుమారు రూ.40 వేల ఆస్తి నష్టం సంభవించింది.

శెట్టూరు మండలం చెర్లోపల్లిలో ఈత చెట్టు విద్యుత స్తంభంపై పడటంతో స్తంభం విరిగిపడింది. పలు ప్రాంతాల్లో విద్యుత స్తంభాలు, ట్రాన్సఫార్మర్లు నేలకొరిగాయి.  బెలుగుప్ప, వజ్రకరూరు తదితర మండలాల్లో ఈదురుగాలులతో కూడిన వ ర్షం పడింది. తనకల్లులో ఓ మోస్తారు వర్షం పడింది. బుధవారం రాత్రి జిల్లాలోని 17 మండలా ల్లో వాన కురిసింది. ్ఞఅత్యధికంగా ఉరవకొండ 46.8  మి.మీ., లేపాక్షి 35.2, హిందూపురం 25.4, పరిగి 30.4, 25.2 సోమందేపల్లి వజ్రకరూరు 27.8, పుట్టపర్తి 21.8 మి.మీ., వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 19.6 మి.మీ.,లోపు వర్షం పడింది.


 ఉరవకొండలో..

పట్టణంలో గురువారం మధ్యాహ్నం అరగంటపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. పాతబస్టాండు ఆవరణంలోకి భారీగా వర్షపునీరు చేరింది. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇంద్రానగర్‌లో భారీ చెట్టు నేలకూలింది. షిర్డీసాయినగర్‌లో ఓ ఇంటి సమీపాన పిడుగు పడటంతో గోడలు నెర్రెలు చీలాయి. పెద్దముష్టూరు వీధుల్లోకి వర్షపు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా రేణుమాకులపల్లిలో విద్యుత స్తంభాలు నేలకూలాయి. దీంతో తాగునీటి పంపింగ్‌ నిలిచిపోయింది. మరమ్మతులు చేపట్టినా మరలా గాలివానకు సరఫరా ఆగిపోయింది. అమరాపురం మండలంలో  బుఽ దవారం రాత్రి వీచిన ఈదురుగాలలు వడగండ్ల వర్షానికి వక్క, తమలపాకు, అరటి చెట్లు నేలకూలాయి. మండలంలో వక్క, తమలపాకు చెట్లు అధికంగా సాగుచేశారు. ఈదురుగాలలు పంటలు దెబ్బతిన్నాయి. మద్దనకుంట రైతు వీరభద్రప్పకు చెందిన 15 వక్క, 10 బొప్పాయి, అరటిచెట్లు నేలకొరిగాయి.


పిడుగు పడి  నాలుగు ఆవుల మృతి

అమడగూరు మండలంలోని జౌకల గ్రామంలో గు రువారం సాయంత్రం పిడుగు పడి రైతు నరసింహులుకు చెందిన నాలుగు ఆవులు మృతి చెందాయి. ఎండలు ఎక్కువగా ఉండటంతో ఇంటికి దగ్గరగా ఉన్న మామిడితోటలో ఆవులను కట్టేశాడు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షానికి ఆవులున్న చోట పిడుగు పడింది. దీంతో ఆవులు మృతిచెందినట్లు రైతు వాపోయాడు. దీంతో రూ.3.50 లక్షల నష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన చెందాడు. జీవనాధారం కోల్పోయానని వాపోయాడు.


పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధం 

శెట్టూరు మండలంలోని కనుకూరు గ్రామంలో గురువారం పిడుగు పాటుకు కొబ్బరి చెట్టు దగ్ధమైందని బాధిత రైతు శివన్న తెలిపాడు. మండలంలోని చెర్లోపల్లిలో ఈదురుగాలులకు బస్టాండు ప్రాంతంలోని ఈత చెట్టు విరిగి, విద్యుత తీగలపై పడింది. దీంతో విద్యుత స్తంభం నేలకొరిగింది.


నేలకొరిగిన అరటి పంట

బెళుగుప్ప మండలంలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షానికి గంగవరం, హనిమిరెడ్డిపల్లి పరిధిలో 14 ఎకరాల్లో అరటి పంట దెబ్బతింది. చేతికొచ్చిన పంట నేలపాలు అయ్యిందంటూ బాధిత రైతులు గంగవరం చత్రగదప్ప, రామాంజనేయులు వాపోయారు. వీరిరువురికి చెరో 4 ఎకరాల్లో పంట దెబ్బతింది. హనిమిరెడ్డిపల్లి సమీపంలో నేలకొరిగిన అరటి పంటను ఉద్యానవన శాఖాధికారి ధనుంజ య పరిశీలించారు. గంగవరానికి చెందిన సర్దానప్ప, విరుపాక్షప్ప, శారతమ్మకు చెందిన 6 ఎకరాల్లోని అ రటిపంట 80 శాతం నష్టం వాటిల్లిందనీ, ఆ మేరకు ప్రభుత్వానికి నివేదికలు పంపుతామని అధికారి తెలిపారు.

Updated Date - 2021-04-23T06:22:41+05:30 IST