HEAVY RAINS: వచ్చే 72 గంటలపాటు భారీవర్షాలు...దుర్గాపూజకు అంతరాయం

ABN , First Publish Date - 2022-10-03T14:19:55+05:30 IST

దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాపూజ కార్యక్రమాలకు భారీవర్షాలు విఘాతం కల్పించనున్నాయి....

HEAVY RAINS: వచ్చే 72 గంటలపాటు భారీవర్షాలు...దుర్గాపూజకు అంతరాయం

న్యూఢిల్లీ: దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గాపూజ కార్యక్రమాలకు భారీవర్షాలు విఘాతం కల్పించనున్నాయి. వచ్చే 72 గంటలపాటు పశ్చిమబెంగాల్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ తో పాటు పలు రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని భారత వాతావరణశాఖ (ఐఎండీ) సోమవారం వెల్లడించింది. వచ్చే మూడు రోజుల పాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ సోమవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్ లో పేర్కొంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం వల్ల అక్టోబరు 4వతేదీ వరకు ఒడిశా, జార్ఖండ్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అధికారులు చెప్పారు. భారీవర్షాల వల్ల  బెంగాల్ రాష్ట్రంలోని కోల్ కతా, అసన్ సోల్ తోపాటు పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీవర్షాల వల్ల దుర్గాపూజ మండపాలు దెబ్బతిన్నాయి.


 కొవిడ్ మహమ్మారి వల్ల ఇప్పటికే రెండేళ్లుగా దుర్గాపూజ ఉత్సవాలు పూర్తి స్థాయిలో జరగలేదు. దక్షిణ బెంగాల్, పుర్బా, పశ్చిమ మేదినీపూర్, దక్షిణ, ఉత్తర 24 పరగణాస్, బిర్ భూమ్ జిల్లా భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు హెచ్చరించారు. బంగాళాఖాతంలోని అల్పపీడన ప్రభావం వల్ల సముద్రంలో అలలు ఉవ్వెత్తున లేవడంతోపాటు మూడు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్,  రాష్ట్రాల్లో వచ్చే మూడు నాలుగు రోజులపాటు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ వివరించింది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని మధ్య ట్రోపోస్పిరిక్ స్థాయిల వరకు వాయుగుండం కొనసాగుతోందని ఐఎండీ తెలిపింది.



అక్టోబర్ 4 వతేదీ వరకు అసోం,  మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం,త్రిపురలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు,ఉరుములు,మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది.మహారాష్ట్రలోనూ భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. ఒడిశా రాష్ట్రంలో సోమవారం నుంచి అక్టోబరు 7వతేదీ వరకు భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేశారు. బాలాసోర్, భద్రాక్, జైపూర్, కేంద్రపారా, కటక్, జగత్ సింగాపూర్, పూరి, ఖుర్దా, నయాగడ్, గంజాం, గజపతి, సుందరఘడ్, కియోంజర్, మయూర్ భంజ్, దియోఘర్, అంగూల్ ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని ఐఎండీ అధికారులు వివరించారు. 



Updated Date - 2022-10-03T14:19:55+05:30 IST