ఏళ్లయినా ఎదురుచూపే

ABN , First Publish Date - 2022-06-20T05:22:08+05:30 IST

రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని రైతులను నిండా ముంచాయి. కళ్ల ముందే వందల ఎకరాల వరి పంట, రైతుల భూము లు కోతకు గురయ్యాయి.

ఏళ్లయినా ఎదురుచూపే
పంట పొలాల మీదుగా ఉధృతంగా పెదవాగు ప్రవాహం

పంటలు నీటమునిగినా అందని పరిహారం

నివేదికలు పంపినా పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం

వ్యవసాయాధికారుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు

కరకగూడెం, జూన్‌ 19: రెండేళ్ల క్రితం కురిసిన భారీ వర్షాలకు నియోజకవర్గంలోని రైతులను నిండా ముంచాయి. కళ్ల ముందే వందల ఎకరాల వరి పంట, రైతుల భూము లు కోతకు గురయ్యాయి. గుట్టలు, అడవులు, వట్టివాగు, పులుసు బొంత వాగుల నుంచి పెద్ద ఎత్తున వరద ప్రవహించడంతో కరకగూడెం, పినపాక మండలాల్లో భూము లన్నీ ద్వీపలయ్యాయి. పాలకులు, అధికారులు నీట ముని గిన పంట పొలాలను పరిశీలించారు. ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని హామీలు ఇచ్చారు రెండేళ్ళు దాటిన నేటికి పరిహారం అందించిన దాఖాలాలు కరువయ్యాయని రైతులు వాపోతున్నారు.

భారీగా పంట నష్టం

వ్యవసాయ శాఖ అంచనాల ప్రకారం కరకగూడెం 470, పినపాకలో 595, మణుగూరులో 506, అశ్వాపురంలో 907, బూర్గంపాడులో 1642, గుండాలలో 54, ఆళ్లపల్లిలో 108 మొత్తం 4,282 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. పంట నష్టం అంచనాలను ఉన్నతాదికారులకు పంపించినట్లు అధికారు లు అప్పట్లో తెలిపారు. కానీ ఇంత వరకూ పరిహారం వచ్చిన దాఖలాలు లేవు. కన్పించినా ప్రజాప్రతినిధులకు, ఎదురైన అధికారులకు విన్నవించినా ఇంత వరకూ రైతులకు పరిహారం అందలేదు.

నివేదికలు ఇచ్చినా పరిహారం రాలేదు

ఇప్పటికే ఆయా మండలాల వ్యవసాయ శాఖాధికారులు పంట నష్టంపై నివేదికలు పంపించారు. అప్పట్లో పంట పొలాలను ఎమ్మెల్యే రేగా కాంతారావు పరిశీలించారు. పరిహారం ఇస్తామని హామీ ఇచ్చారు. కానీ వ్యవసాయ శాఖ అధికారులు సృష్టమైన సమాచారం ఇవ్వకపోవడంతో రైతుల్లో అయోమయం నెలకొంది. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్‌ బీమా యోజన ప్రీమియం చెల్లించకపో వడంతో రైతులకు కేంద్ర సాయం వచ్చే అవకాశం లేకుం డా పోయింది. రైతులు బ్యాంకు రుణాలు తీసుకునే సమ యంలో ప్రీమియం వసూలు చేశారు. వర్షాలు కురిసి పంటలన్నీ నీటమునిగినా రైతులకు పైసా కూడా పరిహారం ఇవ్వలేదు. కొందరు రైతులు బ్యాంకర్లను కలిసి తమ ఆవేదనను విన్నవించుకు న్నా సాంకేతిక కారణాలు చూపుతూ పరిహారం రాదని చెప్పారని రైతులు వాపోతున్నారు.

నష్ట పరిహారం అందించాలి

ఇస్లావత్‌ రాధాకృష్ణ, రైతు, కలవలనాగారం

కురిసిన భారీ వర్షాలకు ఒర్రెల నుంచి, పెద్దవాగుల నుంచి వరద పోటెత్తింది. మాకున్న పది ఎకరాల భూమిలో కొంత పెద్దవాగు ప్రవాహానికి, ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగింది. ఇసుకను తొలగించేందుకు చాలా ఇబ్బం దులుపడ్డాం. పంటలన్నీ వాగు ప్రవాహానికి  పూర్తిగా కొ ట్టుకుపోయి భారీగా నష్టం జరిగింది. అధికారులు పరిశీలించారు. రెండేళ్లయినా ఇంత వరకూ పరిహారం ఇవ్వలేదు.

రైతులను పట్టించుకోవడం లేదు

తోలెం నాగేశ్వరావు, సర్పంచ్‌, భట్టుపల్లి

వర్షాలతో పంట, పంటపొలాలు కోతకు గురై భారీ నష్టం జరిగింది. ప్రజాప్రతినిధులు, అధికారులు వచ్చి నష్ట పరిహారం అందిస్తామని హామీలు ఇచ్చారు. కానీ ఇప్పటికి నష్ట పోయిన రైతులకు పైసా కూడా ఇవ్వలేదు. రైతులను పట్టించుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమ య్యాయి. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు నష్ట పరిహారం వెంటనే వచ్చేది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నష్టపోయిన  రైతులకు పరిహారం అందించాలి.

Updated Date - 2022-06-20T05:22:08+05:30 IST