వానొస్తే వణుకే

ABN , First Publish Date - 2022-06-24T05:36:55+05:30 IST

నెర్రెలిచ్చిన గోడలు. కురుస్తున్న పైకప్పు... చిరుజల్లుకే చిత్తడిగా మారుతున్న గదులు.. వెరసి శిథిలంగా మారిన భవనంలో ప్రాణభయంతో మండల రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు..

వానొస్తే వణుకే
వర్షపు నీటిలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది

శిథిలావస్థలో గుండాల మండల రెవెన్యూ కార్యాలయం

వాననీటిలోనే ఉద్యోగులు విధులు

తడిసి ముద్దవుతున్న దరఖాస్తులు

నూతన భవన నిర్మాణంలో అధికారుల నిర్లక్ష్యం

గుండాల, జూన్‌ 24: నెర్రెలిచ్చిన గోడలు. కురుస్తున్న పైకప్పు... చిరుజల్లుకే చిత్తడిగా మారుతున్న గదులు.. వెరసి శిథిలంగా మారిన భవనంలో ప్రాణభయంతో మండల రెవెన్యూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.. గుండాల మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యలయం శిథిలమై ప్రమాదకరంగా మారింది. రెండు దశాబ్దాల క్రితం నాసిరకంగా నిర్మించిన భవనం ప్రస్తుతం శిథిలావస్థకు చేరింది. గోడలు నెర్రెలిచ్చాయి. పైకప్పు శిఽథిలమై కురుస్తుండటంతో ఏక్షణంలో ఏం జరుగుతుందో అని అధికారులు, సిబ్బంది బిక్కుబిక్కుమంటూ విదులు నిర్వర్తిస్తున్నారు. మంగఽళవారం రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి స్లాబ్‌ నుంచి వాన నీరు గదుల్లోకి నీరు చేరింది. ఉదయాన్నే కార్యాలయ సిబ్బంది నీటిని బయటకు ఎత్తి పోయాల్సి వచ్చింది ధరఖాస్తు కాగితాలు, విలువైన ఫైళ్లు తడచిపోవడంతో ఆరుబయట ఎండలో ఆరబెట్టారు. వరుసగా రెండు మూడురోజులు వర్షం వస్తే కార్యాలయంలో ఫైళ్లు భద్రపరిచేందుకు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు సమాయాల్లో గోడల్లోకి నీరు ప్రవేశించి కార్యాలయం మొత్తం విద్యుత్‌ ప్రసారమవుతోంది. వివిద పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలతో సిబ్బంది నీరు చేరిన గదుల్లోనే కూర్చొని విదులు నిర్వహిస్తున్నారు. దీంతో కార్యాలయంలో పని చేస్తున్న సిబ్బంది ఆందోళనకు గురవుతున్నారు. వర్షాలు వచ్చిన సమయంలో ఏ క్షణాన ఏమి జరుగుతుందోనని భీతిళ్లుతున్నారు. అనేక మార్లు జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా సమస్య పరిష్కారానికి నోచుకోవంలేదు. ఇప్పటికైనా ఉన్నాతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని రెవెన్యూ ఉద్యోగులు కోరుతున్నారు.


Updated Date - 2022-06-24T05:36:55+05:30 IST