వానొస్తే వణుకే

ABN , First Publish Date - 2022-07-04T06:37:23+05:30 IST

మణుగూరు.. జిల్లాలో అతి పెద్ద పట్టణాల్లో ఒకటి. సింగరేణి గనులు, ఇతర చిన్నాచితకా పరిశ్రమలు ఉండటంతో పట్టణం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోంది.

వానొస్తే వణుకే
సంతోష్‌నగర్‌ పాఠశాలలో నిలిచిన వరద నీరు

డ్రెయిన్లు లేక ముంచెత్తుతున్న వరద

లోతట్టు ప్రాంతాల ప్రజల బిక్కుబిక్కు

నివారణ చర్యల్లో అధికారులు విఫలం

ఇదీ మణుగూరు పట్టణంలో పరిస్థితి

మణుగూరు/ మణుగూరు టౌన్‌, జూలై 3: మణుగూరు.. జిల్లాలో అతి పెద్ద పట్టణాల్లో ఒకటి. సింగరేణి గనులు, ఇతర చిన్నాచితకా పరిశ్రమలు ఉండటంతో పట్టణం నానాటికీ అభివృద్ధి చెందుతోంది. కానీ ఆ స్థాయికి తగ్గట్టుగా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం విఫలమవుతోంది. ఫలితంగా చిన్నపాటి వర్షానికే పట్టణం చిగురుటాకులా వణుకుతోంది. ముఖ్యంగా మణుగూరు మండల పరిధిలోని సమితి సింగారం, మునిసిపాలిటీ పరిధిలోని లోతట్టు ప్రాంతాలు అన్ని జలమయమవుతున్నాయి. సాయినగర్‌ సంతోష్‌నగర్‌ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆవరణలో వరద నీరు నిల్వ ఉం టోంది. ముఖ్యంగా పూజారి నగర్‌220 కేవీ ఏరియా, ఆదర్శనగర్‌ తదితర ప్రాంతాల్లో వరద నీరు బయటికి వెళ్లేందుకు రోడ్లకు ఇరువైపులా సరైన డ్రెయిన్లు లేకపోవడంతో నీరు అక్కడే నిల్వ ఉం టోంది. 220కేవీ సబ్‌ స్టేషన్‌కు వెళ్లే ప్రదాన రహదారిపై కూడా వర్షపు నీరు పలు చోట్ల డ్రెయి న్లలోకి పోయేందుకు మార్గం లేక రోడ్డుపైనే నిలిచిపోతున్నాయి. దీంతో పాదచారులు, వాహనదా రులు నరకం చూస్తున్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఓబీ మట్టితో నిండిన ప్రధాన కాలువ..

మణుగూరు మునిసిపాలిటీ పరిధిలోని సింగరేణి సివిల్‌ ఆఫీస్‌ కనకదుర్గ గుడి ప్రాంతంలోని ప్రధా న రహదారిపై ఉన్న ప్రధాన కాలువ ఓబీ మట్టితో పూడుకుపోయింది. గత నెల 27న మణు గూరులో కురిసిన భారీ వర్షాలకు ఓసీ గనుల ఓబీ డంప్‌ యార్డుపై నుంచి వచ్చిన వరద సీఎస్‌పీ కాంఠా.. కనకదుర్గ గుడి సమీపంలోని ప్రధాన రహదారి, భగత్‌సింగ్‌నగర్‌ ప్రాంతాలను ముంచె త్తింది. కాగా నాడు ఓబీ డంప్‌ యార్డుపై నుంచి వరదతో పాటు వచ్చిన మట్టి ప్రధాన రహదారిపై ఉన్న ప్రధాన కాల్వలను పూడ్చివేసింది. ఇది జరిగి వారం గడస్తున్నా అటు సింగరేణి అధికారులు, ఇటు మునిసిపల్‌ అదికారులు పట్టించుకోకపోవడంతో కాలువల్లో ఓబీ మట్టి అలానే మిగిలి పోయింది. దీంతో మరలా భారీ వర్షాలు కురిస్తే ఓబీ యార్డులపై నుంచి వచ్చే వరద ప్రవాహం ఎటు పోతుందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. లోతట్టు ప్రాంతంగా ఉన్న దుర్గ గుడి సమీపంలోని ప్రధాన రహదారిపై ఉన్న దుకాణాల్లోకి కాలువలు సక్రమంగా ఉన్నప్పుడే వరదలు వచ్చాయని.. ఇ ప్పుడు అదే పరిస్థితి నెలకొంటే వరద మొత్తం దుకాణాల్లోనే ఉంటుందని వ్యాపారస్థులు వాపోతు న్నారు.

మణుగూరులో ఆగని వర్షం

నాలుగు రోజులుగా అడపాదడపా కురుస్తోన్న వర్షం.. శనివారం, ఆదివారాల్లో కూడా భారీగానే కురిసింది. శనివారం అర్థరాత్రి ప్రారంభమైన వర్షం ఆదివారం తెల్లవారు జాము వరకు కురిసింది. తిరిగి మాద్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ప్రారంభమైన వర్షం గంటకు పైగా భారీగానే కురిసిం ది. ఆ తర్వాత ఆరగంటకొకసారి తెరిపిస్తూ వర్షం కురుస్తూనే ఉంది. పరిస్థితి ఇలానే కొనసాగితే తిరిగి దుర్గ గుడిప్రాంతంలో వరద తిరిగి పొంగిపొర్లే అవకాశం లేకపోలేదని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. 

Updated Date - 2022-07-04T06:37:23+05:30 IST