
బర్మింగ్‌హామ్: భారత్-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టుకు వరుణుడు అడ్డుతగులుతూనే ఉన్నాడు. తొలి రోజు భారత్ (Team India) ఫస్ట్ ఇన్నింగ్స్‌ను కాసేపు అడ్డుకున్న వరుణుడు నేడు మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. 416 పరుగుల వద్ద భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసిన తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ (England) 16 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. ఆరు పరుగులు చేసిన అలెక్స్ లీస్ (Alex Lees)ను బుమ్రా బౌల్డ్ చేశాడు. ఒల్లీ పోప్ (Ollie Pope) క్రీజులోకి వచ్చాడు. అయితే, అదే సమయంలో వర్షం ప్రారంభం కావడంతో లంచ్ బ్రేక్ (Lunch Break) ప్రకటించారు.
లంచ్ తర్వాత వర్షం తగ్గుముఖం పట్టడంతో మ్యాచ్ తిరిగి కొనసాగింది. మ్యాచ్ ప్రారంభమైన కాసేపటికే ఇంగ్లిష్ జట్టు మరో వికెట్ కోల్పోయింది. మరో ఓపెనర్ జాక్ క్రాలీ (9)ని కూడా బుమ్రా (Jasprit Bumrah) పెవిలియన్ పంపాడు. దీంతో 27 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయింది. మ్యాచ్ ప్రారంభమయ్యాక మూడు ఓవర్లు కూడా పూర్తి కాకముందే అంటే 6.3 ఓవర్ల వద్ద మళ్లీ వర్షం (Rain) ప్రారంభం కావడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి ఇంగ్లండ్ 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది. జో రూట్ (2), ఒల్లీ పోప్ (6) క్రీజులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి