దంచికొట్టిన Rain

ABN , First Publish Date - 2022-05-27T02:00:30+05:30 IST

వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రం గంటపాటు జోరు వాన కురిసింది. వర్షానికి పట్టణంలోని కొన్ని రోడ్లపై

దంచికొట్టిన Rain

తాండూరు: వికారాబాద్‌ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం సాయంత్రం గంటపాటు జోరు వాన కురిసింది. వర్షానికి పట్టణంలోని కొన్ని రోడ్లపై, గుంతల్లో నీరు నిలిచింది. బసవన్న కట్ట, ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి ఎదుట రోడ్డుపై గుంతలు ఉండటంతో వర్షపు నీరు పెద్దమొత్తంలో నిలిచింది. మురుగు కాల్వలు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. గంటపాటు కురిసిన వర్షంతో వాతావరణం పూర్తిగా చల్లబడింది. అదేవిధంగా మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్‌లో పది నిమిషాల పాటు మోస్తరు వర్షం కురిసింది. ఎండ తీవ్రతతో విలవిల్లాడుతున్న జనాలు ఒక్కసారిగా వాతవరణం చల్లబడి వర్షం పలకరించడంతో కాస్త ఉపశమనం పొందారు.

Updated Date - 2022-05-27T02:00:30+05:30 IST