ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట వర్షం నీరు

ABN , First Publish Date - 2022-10-08T05:48:48+05:30 IST

నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది.

ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట వర్షం నీరు
పోలీసు స్టేషన్‌ ఎదుట నిలిచిన వర్షం నీటిలో వెళ్తున్న పోలీసులు

పట్టించుకోని పారిశుధ్య సిబ్బంది

కర్నూలు(న్యూసిటీ), అక్టోబరు 7: నగరంలోని నగర పాలక సంస్థ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న ట్రాఫిక్‌ పోలీసు స్టేషన్‌ ఎదుట వర్షం నీరు నిలిచి చెరువును తలపిస్తోంది. చిన్నపాటి వర్షం వచ్చిందంటే చాలు నీరంతా రోడ్డుపైకి చేరి పోలీసులు, సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. పలుమార్లు పోలీసులు శానిటేషన్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదు. సుమారు నాలుగు సంవత్సరాలుగా సమస్యతో ఇబ్బంది పడుతున్నా మని స్థానిక పోలీసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీ సుస్టేషన్‌ ఎదుటే మసీదు కూడా ఉంది. ప్రతి రోజూ నమా జుకు ముస్లింలు పెద్దసంఖ్యలో వస్తుంటారు. ఈనేపథ్యంలో చెరువును తలపిస్తున్న రోడ్డును దాటుకుని ఏవిధంగా వెళ్లా లని పోలీసులు, ముస్లింలు ప్రశ్నిస్తున్నారు. వర్షాకాలంలో రోడ్డుపై నీరంతా నిలబడటంతో దోమలు వ్యాప్తి చెంది రోగాల బారినపడినట్లు కొందరు పోలీసులు చెబుతున్నారు. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉండటంతో ఈ విధమైన సమస్య వస్తుందని, కాలువ రోడ్డు కంటే ఎత్తుగా ఉండటంతో నీరంతా బయటిక వస్తోందని పోలీ సులు చెబుతున్నారు. తక్షణమే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.


Updated Date - 2022-10-08T05:48:48+05:30 IST