నెల్లూరు: జీజీహెచ్ గ్రౌండ్ ఫ్లోర్‌లోకి వర్షపు నీరు చేరింది. దీంతో జనరేటర్ నీటమునిగిపోయింది. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. వెంటిలేటర్లపై 130 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఒకరు మృతి చెందినట్టు సమాచారం. విద్యుత్ పునరుద్ధరణకి అధికారుల చర్యలు చేపట్టారు.