ఈదురుగాలులతో వర్షం

ABN , First Publish Date - 2022-06-28T05:36:54+05:30 IST

నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండలంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది.

ఈదురుగాలులతో వర్షం
చోడవరంలో కురుస్తున్న వర్షం

చోడవరం, జూన్‌ 27: నైరుతి రుతుపవనాల ప్రభావంతో సోమవారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు మండలంలో ఈదురుగాలులతో వర్షం కురిసింది. గడచిన రెండు రోజులుగా జల్లులు పడుతుండడంతో వాతావరణం మబ్బు పట్టి ఉంది. సోమవారం ఉదయం వాతావరణం కొద్దిగా తెరిపిచ్చినప్పటికీ మధ్యాహ్నం నుంచి పూర్తిగా మబ్బులు కమ్మి ఈదురుగాలులతో వర్షం కురిసింది. దీంతో మళ్లీ ముసురు వాతావరణం కొనసాగుతున్నది. 


Updated Date - 2022-06-28T05:36:54+05:30 IST