గాలి..వాన బీభత్సం

ABN , First Publish Date - 2021-06-23T05:35:37+05:30 IST

జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టిం చాయి.

గాలి..వాన బీభత్సం
తీపర్రులో ఒరిగిన అరటితోట..

రహదారులపై కూలిన చెట్లు 

విరిగిపడిన విద్యుత్‌ స్తంభాలు..తెగిన వైర్లు

తాడేపల్లిగూడెం రూరల్‌/పెరవలి, జూన్‌ 22: జిల్లాలో మంగళవారం సాయంత్రం గాలి, వాన బీభత్సం సృష్టిం చాయి. ఉదయం నుంచి ఎండతోపాటు ఉక్క బోత ఉక్కిరి బిక్కిరి చేసింది. మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఆకాశం మేఘావృతమైంది. ఒక్కసారిగా ఈదురుగాలులతో జల్లు పడింది.  తాడేపల్లిగూడెం, పెరవలి, తణుకు, నిడదవోలు, గణపవరం, నిడమర్రు తదితర ప్రాంతాల్లో భారీ వృక్షాలు, కొమ్మలు నేల కొరిగాయి. తాడేపల్లిగూడెం ఆర్టీసీ బస్టాండ్‌, కొబ్బరి తోట, హౌసింగ్‌ బోర్డు, కొండా లమ్మ ఆలయం వద్ద భారీ వృక్షాలు రోడ్డుకడ్డంగా పడి పోవడంతో వాహ నాల రాకపోకలు స్తంభించాయి. నవాబుపాలెం – జగన్నాఽథపురం రోడ్డు పొడవునా చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.ఈ క్రమంలో అస్వస్థతకు గురైన వ్యక్తిని 108 అంబు లెన్స్‌లో తరలిస్తుండగా వెళ్లే దారిలేకపోవడంతో వేరే అంబులెన్స్‌లో తరలించారు. రామన్నగూడెంలో కోళ్ల షెడ్‌ పూర్తిగా ధ్వంసమైంది. నిడదవోలు–నరసాపురం రోడ్డులో పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడి రోడ్డుపై పడటంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. పెరవలి పోలీసులు సకాలంలో స్పందించి వాటిని తొలగించి లైన్‌ క్లియర్‌ చేశారు. తీపర్రు పుష్కరాల రేవు సమీపంలో కొబ్బరిచెట్టు విరిగి పక్కనే వున్న ట్రాన్స్‌ఫార్మర్‌పై పడి స్థంభాలతో సహా నేలకొరిగింది.అరటి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. ఎకరానికి 50 నుంచి 100 చెట్ల వరకు విరిగిపడ్డాయని రైతులు చెబుతున్నారు. పలుచోట్ల విద్యుత్‌ వైర్లు తెగిపోయాయి. 


Updated Date - 2021-06-23T05:35:37+05:30 IST