వర్షం..భయం..!

ABN , First Publish Date - 2021-11-29T05:20:38+05:30 IST

వాయుగుండం ప్రభా వంగా మళ్లీ వానలు పడుతున్నాయి.

వర్షం..భయం..!
కొమరోలులో వర్షానికి దెబ్బతిన్న పొద్దుతిరుగుడు


పొలాల్లోకి చేరుతున్న వరద

నీట మునిగిన పంటలు

ఆందోళనలో అన్నదాతలు

రాచర్ల, నవంబరు 28 :  వాయుగుండం ప్రభా వంగా మళ్లీ వానలు పడుతున్నాయి. దీంతో రైతు ల్లో ఆందోళన మొదలైంది. మొన్నటివరకు కురిసిన వర్షాలకు ఇప్పటికే 90 శాతం పంటలు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తాజాగా బంగాళాఖాతంలో మరో వాయుగుండం ఏర్పడడంతో రాచర్ల మండలంలో ఆది వారం తెల్లవారుజాము నుంచి వర్షం కురు స్తోంది. జల్లులతో వర్షం ఆదివారం రాత్రి వ రకు కురుస్తూనే ఉన్నది. దీంతో అక్కడ క్కడా మిగిలి ఉన్న పంట కూడా దెబ్బతింటుందని రైతులు విలపిస్తున్నారు.  మరో రెండురోజులపాటు వర్షాలు ఇలాగే కురిస్తే ఈ సంవత్సరాని కి సం బంధించి ఖరీఫ్‌, రబీలలో వేసుకున్న పం టలు మొ త్తం నష్ట పోయినట్లేనని రైతులు చెప్తున్నారు.

పొద్దుతిరుగుడుకు తీవ్ర నష్టం

కొమరోలు :  వరుసగా కురుస్తున్న వర్షాలు రైతులను తీవ్ర నష్టానికి గురి చేస్తున్నాయి. మండలంలో పొద్దు తిరుగుడు పంట సుమారు 200 ఎకరాల్లో సాగు చేశారు. రైతులు ఎకరాకు సుమారు రూ.30 నుంచి రూ.40వేల వరకూ ఖర్చు చేశారు. పంట పూత దశకు చేరుకునేసరికి ఇటీవల 20 రోజుల నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పూత, పిందెలను పురుగులు తినేశాయి. పంట నష్టంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  మందు పిచికారీ చేయాలన్నా వానలు కురుస్తుండడంతో ఉపయోగం లేదని అంటున్నారు. నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని పొద్దుతిరుగుడు సాగు రైతులు ప్రభుత్వాన్ని కోరు తున్నారు. 



Updated Date - 2021-11-29T05:20:38+05:30 IST