ఇంకా.. నీటిలోనే

ABN , First Publish Date - 2021-11-24T06:02:35+05:30 IST

వరుణుడు కనికరించడంలేదు.. చేలల్లో ఏమో కోతకు వచ్చిన పంట ఉంది. ఆరుగాలం కష్టించి పండించి.. చేతికందే దశలో పైరు నీటి పాలవుతుండటంతో రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు.

ఇంకా.. నీటిలోనే
నీటిలో పడిపోయిన వరి పైరు

చేలల్లో నానుతున్న పైర్లు

వీడని వాన పొలాల్లో తొలగని నీరు 

రోజురోజుకు పెరుగుతున్న పంట నష్టం

ఇప్పటికి 61 వేల ఎకరాల్లో దెబ్బతిన్నట్లు నివేదిక 


వరుణుడు కనికరించడంలేదు.. చేలల్లో ఏమో కోతకు వచ్చిన పంట ఉంది. ఆరుగాలం కష్టించి పండించి.. చేతికందే దశలో పైరు నీటి పాలవుతుండటంతో రైతన్న కన్నీటి పర్యంతమవుతున్నాడు. పైరును కాపాడుకునేందుకు చేస్తోన్న ప్రయత్నాలు సఫలం కావడంలేదు. రోజుల తరబడి చేలల్లో నిలిచిన వాన నీటిలో పైరు తడిచి పోతుంది. భూమిలో నీరు ఇంకక.. పొలాల నుంచి నీరు బయటకు పోక నష్టం రోజురోజుకు పెరిగిపోతూ ఉంది. ఇప్పటికే 61 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక  అంచనా వేశారు. ఈ నష్టం మరింత పెరిగే అవకాశం ఉంది.

    (గుంటూరు - ఆంధ్రజ్యోతి) 

వరుస వాయుగండాలు.. వీడని వర్షాలు.. చెరువులను మరిపిస్తున్న చేలు.. నీటిలోనే నానుతున్న పైర్లు.. తడిసి మొలకెత్తుతున్న పంటలు.. ఇదీ జిల్లాలో రైతన్న పరిస్థితి. వాన నీరు ఇంకా పొలాల్లోనే ఉండటంతో రోజురోజుకు నష్టం క్రమంగా పెరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజులుగా దశల వారీగా ఓ మోస్తరు నుంచి భారీగానే వర్షాలు పడ్డాయి. జిల్లాలోని పలు ప్రాంతాల్లో మంగళవారం కూడా వర్షం పడింది. దీంతో భూమిలో నీరు ఇంకక పొలాల నుంచి నీరు బయటకు పోవడంలేదు. పలు డ్రెయిన్లు, కాల్వలు నిండుగా ప్రవ హిస్తున్నాయి. కొన్ని దగ్గర్ల డ్రెయిన్లు పూడికతో నిండి ఉండటంతో నీరు పొలా ల్లోకే ఎగతన్నుతుంది. రోజుల తరబడి పొలాల్లో నీరు నిలిచి ఉండటంతో పంట ల రక్షణకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నా ఫలితం ఉండటంలేదు. దీంతో డెల్టా లో వరి కంకుల్లోని గింజలు మొలకెత్తుతున్నాయి. పల్నాడు ప్రాంతంలో రెండో తీతకు సిద్ధంగా ఉన్న పత్తి గుబ్బలలోని గింజల నుంచి కూడా మొక్కలొస్తు న్నాయి. మిరప మొక్కలు ఉరకేస్తున్నాయి. కూరగాయలు మొక్కలు నానిపోతు న్నాయి. తమలపాకు, అరటి, మిరప, కూరగాయలు వంటి ఉద్యాన పంటలు కూడా వాననీటిలో ఉన్నాయి. ఇప్పటికే 61 వేల ఎకరాల్లో పంట దెబ్బతిన్నట్లు అధికారులు ప్రాథమిక  అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఇది ఇంకా పెరుగుతుందని వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు తెలిపారు.  

పంట నష్టం ఇలా.. 

జిల్లాలో 29 మండలాల్లో 61,563 ఎకరాల్లో వరి, మిర్చి, మినుము, పత్తి, అరటి, తమలపాకు, కూరగాయలు, ఉల్లి పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ శాఖ జేడీ విజయభారతి ప్రభుత్వానికి నివేదిక పంపారు. ఆర్‌బీకేల వారీగా సర్వేలకు ప్రత్యేక టీములు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 24 మండలాల్లో 55,490.75 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు అధికారులు అంచనా వేశారు. మండలాల వారీగా చూస్తే పొన్నూరు - 5,574, చేబ్రోలు - 3,320, చుండూరు- 4,980, అమర్తలూరు - 4,404, రేపల్లె - 4,869, భట్టిప్రోలు - 2,641, చెరుకుపల్లి - 6,371, నగరం - 1,311.5, పెదకాకాని - 1,000, వట్టిచెరుకూరు - 635, తెనాలి - 3,863, దుగ్గిరాల - 2,702, వేమూరు - 3,200, కొల్లూరు  - 2,472, కొల్లిపర - 3,700, తాడేపల్లి - 241, బాపట్ల - 920, కర్లపాలెం  - 252.2, పిట్టలవానిపాలెం- 350, కాకుమాను - 2,494, గుంటూరు -  452, మంగళగిరి - 645, పెదనందిపాడు - 113 ఎకరాల్లో వరి దెబ్బతిన్నట్లు ప్రభుత్వానికి పంపిన నివేదికలో తెలిపారు. తాడికొండ మండలంలో 37 ఎకరాల్లో  ఉల్లి, చేబ్రోలు మండలంలో 195 ఎకరాల్లో కూరగాయలు, పొన్నూరు మండలంలో ఐదు ఎకరాల్లో అరటి, 15 ఎకరాల్లో తమలపాకు దెబ్బతిన్నట్లు అధికారులు నివేదికలు పంపారు. చేబ్రోలు మండలంలో 384,   వట్టిచెరుకూరు మండలంలో 150, కాకుమాను మండలంలో 400, గుంటూరు మండలంలో 20, పెదనందిపాడు మండలంలో 1,650, ప్రత్తిపాడు మండలంలో 100, తాడికొండ మండలంలో 20, యడ్లపాడు మండలం లో 8 ఎకరాల్లో మిర్చి దెబ్బతిన్నట్లు నివేదిక అంద జేశారు. పొన్నూరులో 97, మంగళగిరిలో 149, పెదకాకానిలో 100, తెనాలిలో 74, దుగ్గిరాలలో 70, కొల్లూరులో 185, భట్టిప్రోలులో 10 ఎకరా ల్లోమినుము నీటిలో మునిగినట్లు తెలిపారు. 

లక్ష ఎకరాల్లో వరికి నష్టం

వ్యవసాయశాఖ జేడీ విజయభారతి

ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా 6 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయగా వర్షాలకు డెల్టాలోనే లక్ష ఎకరాల్లో పంట దెబ్బతిన్న ట్లు వ్యవసాయశాఖ జేడీ విజయభారతి తెలిపారు. మండంలోని భట్టిప్రోలు, అద్దేపల్లి, కోనేటిపురం, పల్లెకోన గ్రామాల్లో మం గళవారం పర్యటించిన ఆమె నీట ముని గిన పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ అత్యధికంగా డెల్టాలోని 18 మండలాల్లో కోతకు వచ్చి న వరి పడిపోయి నీటిలో నానడం వల్ల దెబ్బతిన్నద న్నారు. పది రోజుల్లో కోత కోసే దశలో ఉన్న వరి అధి క వర్షాలతో నీటిలో నాని మొలకెత్తినట్లు తెలిపారు. 33 శాతం పైబడి దెబ్బతిన్న పంటలను ఆన్‌లైన్‌లో నమో దు చేస్తామన్నారు.  రెండో పంటకు విత్తనాలు, పురుగుమందులు అందుబాటులో ఉంచుతామన్నారు. 


Updated Date - 2021-11-24T06:02:35+05:30 IST