2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

ABN , First Publish Date - 2020-07-07T07:30:21+05:30 IST

రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది

2 రోజులు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు

హైదరాబాద్‌, జూలై 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది.  ఆదిలాబాద్‌, నిర్మల్‌ , కుమ్రంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్‌, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సోమవారం ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Updated Date - 2020-07-07T07:30:21+05:30 IST