కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు

ABN , First Publish Date - 2021-11-28T21:55:27+05:30 IST

జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో రైల్వేకోడూరు- తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

కడప జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలు

కడప: జిల్లాలో ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో రైల్వేకోడూరు- తిరుపతి మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారాయి. ఊటుకూరు చెరుకు గండి పడే అవకాశం ఉందని చెబుతున్నారు. గతంలో గండిపడిన చోట అధికారులు తాత్కాలిక మరమ్మతులు చేశారు. ఆందోళనలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వరదల నుంచి ఇప్పడిప్పుడే తేరుకుంటున్న ప్రజలు.. మళ్లీ వర్ష బీభత్సం సృష్టించడంతో ఆందోళనలో ఉన్నారు. జిల్లాలో ఉదయం నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షం కురుస్తోంది. ఆత్మకూరు, వెంకటగిరి, ఉదయగిరి పరిసర ప్రాంతాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా కుండపోత వాన కురిసింది. ఆత్మకూరు, అనంతసాగరం, మర్రిపాడు, కేజర్ల, సంఘం మండలాల్లో దంచికొడుతోంది. దీంతో వాగులు, వంకలు  పొంగిపొర్లుతున్నాయి. 

Updated Date - 2021-11-28T21:55:27+05:30 IST