కుంగిన వంతెన... రాకపోకల బంద్‌

ABN , First Publish Date - 2021-12-18T04:52:33+05:30 IST

పొదలకూరురూరల్‌, డిసెంబరు 17 : మండలంలోని అంకుపల్లి సమీపంలోని వంతెన ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంగిపోయింది.

కుంగిన వంతెన... రాకపోకల బంద్‌
అంకుపల్లి సమీపంలో కుంగిన వంతెన

పొదలకూరురూరల్‌, డిసెంబరు 17 : మండలంలోని అంకుపల్లి సమీపంలోని వంతెన  ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంగిపోయింది. దీంతో పై గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. పొదలకూరు, సోమశిల రోడ్డు, వనంతోపు నుంచి పులికల్లు వరకు 10కిలోమీటర్ల దూరంలో ఈ రోడ్డు మార్గం ఉండగా.. అంకుపల్లి దళితవాడ సమీపంలో 4.5 కిలోమీటర్ల వద్ద వంతెన ఉంది. అయితే గత నెల రోజులుగా కురుస్తున్న ఎడతెరపి లేని వర్షాలకు పొలాల్లోని నీరు వంతెనపై ప్రవహించాయి. దీంతో వంతెన ఫిల్లర్స్‌ కింద మట్టి కొట్టుకుపోవడంతో వంతెన ఒక వైపునకు ఒరిగింది. ఇది జరిగి 20 రోజులు దాటినా నీటిపారుదలశాఖ అధికారులు గానీ, పంచాయతీరాజ్‌ అధికారులుగానీ కన్నెత్తి చూడలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మార్గంలో తిరిగే, పులికల్లు బస్సు అంకుపల్లి దళితవాడ వరకు మాత్రమే వస్తుంది. దీంతో అంకుపలి,్ల పర్వతాపురం, వెంకటాపురం, పులికల్లు గ్రామాల ప్రజలు, ముఖ్యంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. పంచాయతీ పాలకులు స్పందించి 2 ట్రక్కులు గ్రావెల్‌ పోస్తే తాత్కాలికంగా వాహనాలు నడుస్తాయని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కాగా వచ్చేదంతా వ్యవసాయ సీజన్‌ కావడంతో ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్పందించాలని  ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. 

Updated Date - 2021-12-18T04:52:33+05:30 IST