తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

Jun 15 2021 @ 15:02PM

విశాఖ: రెండు తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. చాలా వరకు ఆకాశం మేఘావృతమై ఉండి పలు చోట్ల వర్షాలు కురుస్తాయి. ఖమ్మం పరిసర ప్రాంతాల్లోనూ విశాఖ ఏజెన్సీ, దక్షిణ రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి. దక్షిణ భారత దేశమంతటా కూడా ఈ రుతుపవనాలు వ్యాప్తి చెంది మధ్య భారతంలో కొన్ని రాష్ట్రాల్లో విస్తరించాయి. అటు ఒడిశా పరిసర ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్ ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.