డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాలి

ABN , First Publish Date - 2022-05-17T04:46:29+05:30 IST

డెంగీ వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించా లని కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు.

డెంగీ వ్యాధిపై అవగాహన కల్పించాలి
జెండా ఊపి ర్యాలీని ప్రారంభిస్తున్న కలెక్టర్‌

- కలెక్టర్‌ వెంకట్రావు

- ఘనంగా జాతీయ డెంగీ 

   నివారణ దినోత్సవం

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) మే 16: డెంగీ వ్యాధిపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించా లని  కలెక్టర్‌ వెంకట్రావు అన్నారు. సోమవారం జా తీయ డెంగీ నివారణ దినోత్సవాన్ని పురస్కరించు కొని జిల్లాకేంద్రంలోని జడ్పీ మైదానంలో ఏర్పాటు చేసిన డెంగీ అవగాహన ర్యాలీకి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో గతంలో డెంగీ విస్తృతంగా వ్యాపించిందని, ప్రస్తుతం వైద్య ఆరోగ్య శాఖ చేపడుతున్న చర్యల వలన కొంత వరకు త గ్గిందన్నారు. ముఖ్యంగా ప్రజల్లో డెంగీ నివారణ చ ర్యలపై అవగాహన కల్పించాలని, వ్యాపించే విధా నంపై తెలియజేయాలన్నారు. ముఖ్యంగా ఈ వ్యాధి దోమలు నిల్వ ఉండడం వలన వ్యాపిస్తుం దని, నీరు నిల్వ ఉండే పాతటైర్లు, కొబ్బరి బోం డాలు, పరిసరాల అపరిశుభ్రతను ఆవాసంగా చేసు కొని విజృంభిస్తాయన్నారు. అందువలన దోమలు రాకుండా ఇళ్ల కిటికీలకు దోమ తెరలు ఏర్పాటు చే సుకోవాలని, ఇంటి పరిసరాలతో పాటు ఇంట్లో కూ డా నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా చూ డాలన్నారు. మునిసిపాలిటీలలో ప్రతీ శుక్రవారం డ్రై డే నిర్వహించాలని, దోమల నివారణకు మరిన్ని చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ కృష్ణ, అదనపు డీఎంఅండ్‌హెచ్‌వో డాక్టర్‌ సరస్వతి, జిల్లా మలేరియా అధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌, ప్రోగ్రాం అధికారులు రఫీక్‌ పాల్గొన్నారు.

పీహెచ్‌సీల పరిధిలో..

బాదేపల్లి/మిడ్జిల్‌/రాజాపూర్‌/దేవరకద్ర/కోయిలకొండ/నవాబుపేట/హన్వాడ: పరిసరాలు శుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు ధరి చేరవని జడ్పీ వైస్‌ చైర్మన్‌ యాదయ్య అన్నారు. జాతీయ డెంగీ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా సోమవారం ఎం పీడీవో కార్యాలయం  ఆవరణలో డెంగీ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై కరపత్రాలు విడుదల చే శారు. అనంతరం ర్యాలీని జడ్పీ వైస్‌చైర్మన్‌ ప్రారం భించారు. ఈ సందర్భంగా  ఆయన మాట్లాడుతూ ఇళ్లల్లో నీటిని నిల్వ ఉంచరాదన్నారు. ఎప్పటికప్పు డు శుభ్ర పరుస్తుండాలన్నారు. ప్రతీ వారం డ్రై డే, ప్రైడే కార్యక్రమం నిర్వహించాలన్నారు. కార్యక్ర మంలో ఎంపీడీవో ఉమాదేవి, డాక్టర్‌ సమత, ము నిసిపల్‌ వైస్‌ చైర్‌పర్సన్‌ పాలాధి సారిక, కౌన్సిలర్‌ ప్రశాంత్‌రెడ్డి, రఘువరం గౌడ్‌, రమేష్‌, సతీష్‌, మహేష్‌,  నాయకులు పాలాధి రామ్మోహన్‌, ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, ఆర్పీలు పాల్గొన్నారు. 

- మిడ్జిల్‌ మండల ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యురాలు డాక్టర్‌ వంశీప్రియా ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు అవగాహన కల్పించారు. జ్వరం, తలనొప్పి లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లి తగిన చికిత్స చేయించుకోవాలన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్‌ గీత, ఆశ, అంగన్‌వాడీ కార్యకర్తలు, వైద్య సిబ్బంది తదితరులున్నారు.

- రాజాపూర్‌ మండల కేంద్రంలోని ప్రాథమి ఆరోగ్యకేంద్రం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు.  కార్యక్రమంలో డాక్టర్లు తులసిరామ్‌, మౌనిక, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌, ఏఎన్‌ఎంలు, ఆశలు, అంగన్‌వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. 

- దేవరకద్రలో డాక్టర్‌ రఘు ఆధ్వర్యంలో ర్యా లీ నిర్వహించారు. పలు నినాదాలు చేశారు.  కార్య క్రమంలో  ఆరోగ్య సిబ్బంది,  ఆశవర్కర్లు, ఏఎన్‌ ఎంలు పాల్గొన్నారు.    

- కోయిలకొండ: పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బంది మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఆశవర్కర్లు, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.  

- నవాబ్‌పేట మండల ప్రజలు డెంగీపట్ల జాగ్రత్తగా ఉండాలని ఎంపీపీ అనంతయ్య అన్నా రు. సోమవారం మండల కేంద్రంలోని పీహెచ్‌సీ ఆధ్వర్యంలో డాక్టర్‌ విజయలక్ష్మీ, ఆశకార్యకర్తలతో కలిసి ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంతో తహసీ ల్దార్‌ రాజేందర్‌రెడ్డి, డీపీఎంవో శ్రీనివాస్‌, రాములు, శకుంతల   పాల్గొన్నారు.

- హన్వాడలో సోమవారం డెంగీ నివారణ ది నోత్సవం సందర్భంగా ప్రధాన రహదారి నుంచి గ్రామ పంచాయతీ వరకు ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ రేవతి,కార్యదర్శి వెంకట య్య, డాక్టర్‌ ప్రీతి, సూపర్‌వైజర్‌  శ్రీనువాసులు పాల్గొన్నారు.



Updated Date - 2022-05-17T04:46:29+05:30 IST