పెంచిన బస్సు చార్జీలను రద్దు చేయాలి: సీపీఎం

ABN , First Publish Date - 2022-07-02T06:15:08+05:30 IST

పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు.

పెంచిన బస్సు చార్జీలను రద్దు చేయాలి: సీపీఎం
నంద్యాలలో ధర్నా చేస్తున్న సీపీఎం నాయకులు

నంద్యాల (కల్చరల్‌), జూలై 1: పెంచిన ఆర్టీసీ బస్సు చార్జీలను రద్దు చేయాలని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్‌ కుమార్‌ డిమాండ్‌ చేశారు. నంద్యాల ఆర్టీసీ బస్టాండు ఆవరణలో శుక్రవారం ధర్నా చేపట్టారు. పార్టీ జిల్లా కార్యదర్శి నాగరాజు, పట్టణ కార్యదర్శి నరసింహులు, సభ్యులు వెంకటలింగం, శివ, జైలాను, నిరంజన్‌, జాకీర్‌, కృష్ణ, కిరణ్‌ తదితరులు పాల్గొన్నారు.


నంద్యాల (నూనెపల్లె): పేదలకు భారంగా మారిన పెరిగిన ఆర్టీసీ బస్సు చార్జీలను తగ్గించాలని పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు రఫి డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ నేను ఉన్నాను - నేను విన్నానని చెప్పి జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో అధికారంలోకి వచ్చి బడుగు, బలహీన వర్గాలు, పేద ప్రజల నడ్డి విరుస్తున్నారని అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసుకొని ఇప్పటికే 3 సార్లు బస్సు చార్జీలను పెంచడం దారుణమన్నారు. 


ఆత్మకూరు: ఆర్టీసీ బస్సు చార్జీలు తగ్గించాలని సీపీఎం జిల్లా నాయకులు ఏసురత్నం, రణధీర్‌ డిమాండ్‌ చేశారు. ఆత్మకూరులోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ఇప్పటికే ఏప్రిల్‌ నెలలో ఆర్టీసీ బస్సు చార్జీలను పెంచి తాజాగా డీజల్‌ పేరుతో ఆర్టీసీ చార్జీలను పెంచడం విడ్డూరంగా ఉందన్నారు. బస్సు చార్జీలను పెంచడం వల్ల సామాన్యులపై తీవ్ర ఆర్థికభారం పడనుందని వివరించారు. కార్యక్రమంలో నాయకులు నరసింహ నాయక్‌, స్వాములు, రామ్‌నాయక్‌, మాబాషా, సుధాకర్‌, సురేంద్ర తదితరులు ఉన్నారు. 




Updated Date - 2022-07-02T06:15:08+05:30 IST