నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి

ABN , First Publish Date - 2020-12-04T04:50:29+05:30 IST

రైతుల పొట్టకొట్టి కార్పొరేట్లకు మేలు కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయల్సిందేనని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి డిమండ్‌ చేశారు.

నూతన వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలి
భీమవరంలో రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన

రైతు సంఘాల నిరసన, రాస్తారోకో 

ఢిల్లీలో రైతుల పోరాటానికి మద్దతు


భీమవరం అర్బన్‌, డిసెంబరు 3: రైతుల పొట్టకొట్టి కార్పొరేట్లకు మేలు కలిగించే వ్యవసాయ చట్టాలను రద్దు చేయల్సిందేనని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు జుత్తిగ నరసింహమూర్తి డిమండ్‌ చేశారు. ఢిల్లిలో రైతుల పోరాటానికి మద్దతుగా గురువారం రాస్తారోకో నిర్వహించారు. పార్లమెంటులో సవివరమైన చర్చ లేకుండా హడావుడిగా బిల్లు ఆమోదింపజేసుకున్నా రని విమర్శించారు. సీఐటీయు జిల్లా అధ్యక్షుడు జేఎన్‌వీ.గోపాలన్‌ మట్లాడుతూ చలి, కరోనా ప్రమాదం మధ్య నిద్రాహారాలు మాని రైతులు పోరా టం చేయడం కేంద్రం చేసిన చట్టం ఎంత మేలు చేస్తాయో అవగతం అవుతుందన్నారు. రైతు ఉద్యమానికి మద్దుతుగా కార్మికులు, ప్రజా సంఘాలు భాగస్వాములై మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు. అఽఖిల భారత అగ్రగామి కిసాన్‌ సభ నాయకుడు దండు శ్రీనివాసరాజు, పట్టణ పౌరుల సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ ఎం.వైకుంఠరావు, కె.క్రాంతిబాబు, అల్లూరి అరుణ్‌, పి.సాయికృష్ణ, ఇంజేటి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.


నరసాపురం: రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, ఏపీ కౌలు రైతు సంఘం అధ్వర్యంలో బస్టాండ్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. వ్యవసాయ చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఎం జిల్లా కార్య వర్గ సభ్యుడు కవురు పెద్దిరాజు మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని  కార్పొ రేట్‌ సంస్థలకు అప్పగించేందుకు మోది సర్కారు కొత్త చట్టాన్ని తీసుకొచ్చిం దన్నారు. రైతుల పోరాటాలకు ప్రతి ఒక్కరూ సంఘీభావం తెలపాలన్నారు. ఈ అందోళనలో ముచ్చర్ల త్రిమూర్తులు, మామిడిశెట్టి రామాంజనేయులు, పొన్నాడ రాము, పొగాకు నారాయణరావు తదితరులు పాల్గొన్నారు.


ఆకివీడు: కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాలు తీసుకొచ్చి రైతుల నోటిలో మన్నుకొడుతుందని సీపీఎం పట్టణ కార్యదర్శి గేదెల అప్పారావు, వ్యవసాయ కార్మిక రైతు సంఘం నేత కె.తవిటినాయుడు విమర్శించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా సీపీఎం, వ్యవసాయ కార్మిక రైతు సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో షేక్‌ వలీ, గోపిశెట్టిరాంబాబు, పాపారావు,అచ్చెంనాయుడు, కొట్టు శ్రీను, సింహాచలం, వాసు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-04T04:50:29+05:30 IST