వరుస తుఫానులతో రైతుల్లో ఆందోళన

ABN , First Publish Date - 2021-11-30T06:34:30+05:30 IST

వరుస తుఫానులతో రైతుల్లో ఆందోళన

వరుస తుఫానులతో రైతుల్లో ఆందోళన
ధాన్యాన్ని ఆరబెడుతున్న రైతులు

గన్నవరం, నవంబరు 29 : వాతా వరణాన్ని చూసి రైతులు ఆందోళన చెందు తున్నారు.  వరుస తుపానుల ప్రభావంతో రైతుల కంటికి కునుకు లేకుండా పోయింది. వరి పంట చేతికొచ్చిన సమయంలో వ రుణు డు విజృంభిస్తున్నాడు. ఇప్పటికే పంట అక్క డక్కడ నేలవాలింది. కొన్ని చోట్ల పంటను కోసి కల్లాల్లోకి తరలించారు. మండలంలోని 21 గ్రామాల్లో వరి పంటను సుమారు ఆరు వేల హెక్టార్‌లలో సాగు చేస్తున్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వాతావరణం రైతు లకు అనుకూలంగా ఉంది. పంటను కోసే సమయానికి వరుస తుఫానులు ముంచు కొచ్చాయి. దీంతో రైతులు అల్లాడిపోతు న్నారు. మబ్బులు పట్టి చినుకులు పడుతుం డటంతో మరింత భయాందోళన చెందుతు న్నారు. వర్షం పడితే పంట నేలవాలి మరిం త నష్టం జరుగుతుందని వాపోతున్నారు. పొలాల్లో నీటిని ఇప్పటికే బయటకు తరలి స్తున్నారు. పంట కోసే సమయం మించి పోతుందని రైతులు అంటున్నారు. కొందరు రైతులు పంటను కోసి పనలను తిరగేసే పనిలో ఉన్నారు. ముస్తాబాద ఏరియాలో పంట నూర్చి ఖాళీగా ఉన్న మెరక భూము ల్లోకి తరలించి ఆరబెడుతున్నారు. మబ్బులు పడితే పట్టాలు కప్పుతున్నారు. ఇద్దరు ముగ్గురు కూలీలను పెట్టుకుని ధాన్యాన్ని కాపాడుకుంటున్నామని చెబుతున్నారు. కేసరపల్లి, బుద్ధవరం తదితర గ్రామాల్లో పంట కోసి ఉంది. ఈ తుఫానుల గండం ఎప్పుడు గట్టెక్కుతుందోనని రైతులు ఎదురు చూస్తున్నారు. 

నీరు నిల్వకుండా చూడాలి

  బోళ్లపాడు(ఉయ్యూరు) : పంట పొలా ల్లో నిలిచిన  నీటిని బయటకు పోయేలా రైతులు చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాస్త్రవేత్త సుధారాణి అన్నారు. మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అధికారులు సోమవారం బోళ్ళపాడులో పర్యటించి కోతకోసి పనలపై ఉన్న వరిపొలాలను రైతు లతో కలిసి పరిశీలించారు. 

ఈ సందర్భంగా రైతులనుద్దేశించి మాట్లాడు తూ ఇటీవల  కురిసిన వర్షాలకు  పొలాల్లో నీరు నిలిచిందని, దారులు తీసి నీరు  బయ టకు పోయేలా చూడాలన్నారు. తడిసిన వరి పనలపై  ఐదుశాతం ఉప్పునీటి ద్రావణం పిచికారీ చేయాలని లేదా 20 కేజీలు ఎకరానికి  గళ్లు ఉప్పు పనల మీద జల్లుకో వడం ద్వారా గింజ రంగు మారదని, అలాగే మొలకు కూడా రావన్నారు.  బోర్లకింద దాళ్వా సాగు చేయవద్దని, ప్రత్యమ్నా యంగా మినుము, పెసర, మొక్కజొన్న  సాగు చేయాలని వ్యవసాయ అధికారి జీవీ శివప్రసాద్‌ అన్నారు. మినుములు చల్లే ముందు తప్పనిసరిగా విత్తనశుద్ధి చేయాలన్నారు. కలుపు మొలకెత్తకుండా  పెండి మిథిలిన్‌  1 లీటరు ఎకరానికి మినుములు చల్లే మూడు రోజులు ముందుగా ఇసుకలో కలిపి పొలంమంతా చల్లాలని సూచించారు. చెరకులో కన్పించే  పొలుసు పురుగుల  నివారణకు  కొత్తపిలకలు నాటాలన్నారు.  రైతులు సంజీవరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, వీఏఏలు రఘు, రాధ తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-30T06:34:30+05:30 IST