నేడు నాలుగో విడత రైతు భరోసా విడుదల

ABN , First Publish Date - 2022-05-16T06:34:24+05:30 IST

వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నాలుగో విడత కింద మొదటి దఫా సొమ్మును జమచేసే కార్యక్రమాన్ని సీఎం జగన్‌ ఏలూరు జిల్లా గణపవరంలో సోమవారం ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు.

నేడు నాలుగో విడత రైతు భరోసా విడుదల

జిల్లాలో 1,21,955 మంది రైతులు

రూ. 67.07 కోట్లు జమ

రాజమహేంద్రవరం, మే15(ఆంధ్రజ్యోతి) : వైఎస్‌ఆర్‌ రైతు భరోసా నాలుగో విడత కింద మొదటి దఫా సొమ్మును జమచేసే కార్యక్రమాన్ని  సీఎం జగన్‌ ఏలూరు జిల్లా గణపవరంలో  సోమవారం ప్రారంభించనున్నారని జిల్లా కలెక్టర్‌ కె.మాధవీలత తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.జిల్లాలో 1,21,955 మంది రైతులకు రూ. 67కోట్ల 7 లక్షల 52 వేల 500 జమకానున్నట్టు ఆమె తెలిపారు.జిల్లా స్థాయిలో అనపర్తి నియోజకవర్గం పరిధిలోని రంగంపేట మండలంలోని సింగంపల్లిలో   కలెక్టర్‌ మాధవీలత ప్రారంభిస్తారని జిల్లా  వ్యవసాయాధికారి  ఎస్‌.మాధవరావు తెలిపారు. ఈకార్యక్రమానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరవుతారన్నారు. ఆదాయ పన్ను చెల్లించేవారికి , ఎంపీలు, ఎమ్మెల్యేలకు రైతు భరోసా వర్తించదన్నారు. ఎంత భూమి ఉన్నా సరే రైతుకు ఏడాదికి రూ.13,500 భరోసా సొమ్ము  మూడు దఫాలుగా మే, సెప్టెంబరు- అక్టోబర్‌, డిసెంబర్‌లోనూ ఇస్తారన్నారు. మొదట దఫాగా సోమవారం ప్రతి రైతు ఖాతాలోనూ రూ.5,500  జమ అవుతుందన్నారు.


19 మండలాలకు ఇలా..


మండలం                  రైతులు     నిధులు(కోట్లు)

అనపర్తి 3975 2.18

బిక్కవోలు 6403 3.52 

రంగంపేట 8226 4.52

గోపాలపురం 7832 4.30

దేవరపల్లి 7096 3.90

నల్లజర్ల 9327 5.12

గోకవరం 8350 4.59

కొవ్వూరు 5588 3.07

చాగల్లు 5461 3.00

తాళ్ళపూడి 4935 2.71

నిడదవోలు 8294 4.53

ఉండ్రాజవరం 5190 2.85

పెరవలి 6817 3.75

రాజమహేంద్రవరం 1864 1.02

కడియం 4988 2.74

కోరుకొండ 9811 5.39

రాజానగరం 10,327 5.67

సీతానగరం 7514 4.13


Updated Date - 2022-05-16T06:34:24+05:30 IST