sherlyn chopra: ఎక్కడికీ పారిపోలేదు!

Jul 27 2021 @ 18:59PM

అశ్లీల చిత్రాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్‌ కుంద్రా విచారణలో ఆశ్చర్యపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పోర్న్‌ చిత్రాల ప్రసారానికి ఏర్పాటు చేసిన హాట్‌షాట్స్‌ యాప్‌ను గూగుల్‌ ప్లే స్టోర్‌, యాపిల్‌ యాప్‌ స్టోర్‌ నుంచి తొలగించడానికి ప్లాన్‌–బీ అమలు చేసినట్లు తెలిస్తోంది. బాలీఫేమ్‌ పేరుతో మరో యాప్‌ను ఏర్పాటు చేసి దందాను కొనసాగిస్తున్నట్లు ముంబై పోలీసులు తెలిపాయి. ఇందుకు ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ)కి చెందిన ఓ అధికారిని అతడికి తెలియకుండానే దీనిలో భాగస్వామిని చేసినట్లు వెల్లడైంది.  పరారీలో ఉన్న కుంద్రా సన్నిహితుడు యష్‌ ఠాకుర్‌ ముందస్తు ప్రణాళికతో ఆ అధికారితో మంచి అనుబంధం ఏర్పరచుకున్నారు. అవార్డు గెలుచుకున్న లఘుచిత్రాలను ప్రసారం చేయడానికి ఓ యాప్‌ను ఏర్పాటు చేద్దామనే ఆలోచనను తన ముందుంచాడు. తన భార్య పేరుమీద బాలీఫేమ్‌ యాప్‌ను రిజిస్టర్‌ చేశాడు ఆ అధికారి. ఆ యాప్‌లో అశ్లీల చిత్రాలను అప్‌లోడ్‌ చేయడంతో అతను అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. రాజ్‌కుంద్రా అరెస్ట్‌ అయిన తర్వాతి రోజు ఆ యాప్ట్‌లో ఉన్న వీడియోలను తొలగించమని తమకు చెప్పినట్లు ఈ కేసులో సాక్షులుగా ఉన్న కంద్రా సంస్థకు చెందిన ఉద్యోగులు పోలీసులకు తెలిపారు. మరో కేసులో మరో నిందితురాలిగా ఉన్న నటి షెర్లిన్‌ చోప్రాకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేేసందుకు మంగళవారం ఉదయం 11 గంటలకు కార్యాలయానికి హాజరు కావాలని క్రైమ్‌ బ్రాంచ్‌ సెల్‌ నోటిసులు ఇచ్చిన సంగతి తెలిసిందే! విచారణ అనంతరం పలువురికి సమన్లు జారీ చేేస అవకాశముందని బాలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. ఈ వ్యవహారంపై షెర్లిన్‌ చోప్రా సోషల్‌ మీడియా వేదికగా ద్వారా స్పందించిన విషయం తెలిసిందే. రాజ్‌ కుంద్రా కేసులో మొదట పోలీసులకు స్టేట్‌మెంట్‌ ఇచ్చింది తానేనని ఆమె ఆ వీడియోలో పేర్కొన్నారు. తాను ఎక్కడికి పారి పోలేదంటూ తెలిపింది. 


Follow Us on:

Bollywoodమరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.