Americaలో తెలుగు ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పిస్తున్న ‘రాజ రాజ చోర’.. మొదటి రోజు కలక్షన్ ఎంతంటే..

ABN , First Publish Date - 2021-08-21T19:24:12+05:30 IST

శ్రీవిష్ణు హీరోగా నటించిన రాజ రాజ చోర.. సగటు తెలుగు ప్రేక్షకుడి మనసు దోచుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని దూసు

Americaలో తెలుగు ప్రేక్షకుడిని థియేటర్లకు రప్పిస్తున్న ‘రాజ రాజ చోర’.. మొదటి రోజు కలక్షన్ ఎంతంటే..

శ్రీవిష్ణు హీరోగా నటించిన ‘రాజ రాజ చోర..’ సగటు తెలుగు ప్రేక్షకుడి మనసు దోచుకుంది. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆగస్టు 19న విడుదలైన ఈ చిత్రం హిట్ టాక్‌ను సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ క్రమంలో అగ్రరాజ్యం అమెరికాలో భారీ మొత్తంలో కలక్షన్లను రాబడుతోంది. యూఎస్‌లో కొవిడ్ విజృంభిణ కొనసాగుతున్న తరుణంలో రోజుకు సుమారు లక్ష కేసులు నమోదవుతున్నాయి. అయినప్పటికీ ఈ సినిమాను అమెరికాలోని మన ప్రేక్షకులు ఆదరిస్తున్నారు.


కొవిడ్ నిబంధనలు పాటిస్తూనే.. థియేటర్లకు వెళ్లి మరీ రాజ రాజ చోర సినిమాను వీక్షిస్తున్నారు. దీంతో తక్కువ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రం.. అమెరికాలో బాక్స్ ఆఫీస్‌ వద్ద మొదటి రోజు 24వేల డాలర్లను (సుమారు రూ.18లక్షలు)ను రాబట్టింది. కాగా.. రాజ రాజ చోర సినిమాకు హసిత్ గోలి దర్శకత్వం వహించగా.. అభిషేక్ అగర్వాల్, టీజీ విశ్వ ప్రసాద్‌ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ సినిమాలో మేఘా ఆకాష్, సునయన, రవిబాబు, తనికెళ్ల భరణి తదితరులు ప్రధాన పాత్ర పోషించారు.


Updated Date - 2021-08-21T19:24:12+05:30 IST