రైతులపై కక్ష సాధింపు తగదు

ABN , First Publish Date - 2021-06-16T05:16:34+05:30 IST

రాజధాని అమరావతి ని అభివృద్ధి చేస్తూ.. రైతుకు భరోసా ఇవ్వాలని మహి ళలు, రైతులు కోరారు.

రైతులపై కక్ష సాధింపు తగదు
ఐపీఎస్‌, ఐఏఎస్‌ టవర్ల వద్ద నిరసన తెలుపుతున్న దళిత జేఏసీ సభ్యులు, రైతులు

546వ రోజుకు చేరిన రాజధాని ఉద్యమం


తుళ్లూరు, తాడికొండ, జూన్‌ 15: రాజధాని అమరావతి ని అభివృద్ధి చేస్తూ.. రైతుకు భరోసా ఇవ్వాలని మహి ళలు, రైతులు కోరారు. మూడు రాజధానులకు వ్యతిరే కంగా,రాజధాని రైతులకు మద్దతుగా రాజధాని గ్రా మాల్లో చేపట్టిన ఉద్యమం మంగళవారం 546వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా పలువురు మా ట్లాడుతూ రాజధానిలోని అసైన్డ్‌ భూముల రైతుల కు కౌలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ప్రతిసారీ కోర్టు మెట్లు ఎక్కితేనే కాని రాజధాని రైతులకు వార్షిక కౌలు ఇవ్వటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాజధాని రైతులపై కక్ష సాధింపు చర్యగా సుమారు రూ.190 కోట్లు కౌలు నిలు పుదల చేశారన్నారు. అక్రమంగా దోచుకోవ టానికే రాజధానిని విశాఖకు మార్పుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. మూడు రాజధానుల వలన రాష్ట్రానికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. మూడు రాజధానుల ప్రకటనను వెనక కు తీసుకునే వరకు తమ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతి కోసం జీవనాఽధారమైన భూములు ఇస్తే, రెండేళ్ల నుంచి ఈ ప్రభుత్వం అన్నదాతను నడిరోడ్డు మీద నిలబెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదుకోట్ల మంది అమరావతిని కోరుతుంటే స్వలాభం కోసం పాలకులు మూ డు రాజధానుల ప్రతిపాదన తెచ్చారన్నారు. కేసుల కోసం జగన్‌ ఢిల్లీ పర్యటనలు తప్పితే రాష్ట్ర అభివృద్ధి కోసం ఏనా డూ వెళ్లలేదన్నారు. కేంద్రం మెడలు వంచి అయినా విభజన చట్టంలోని హామీలను, ప్రత్యేక హోదా తెస్తామని ఎన్ని కలప్పుడు చెప్పిన మాటలు ఏమైయ్యాయని అన్నారు. పాలకులు మారితే  ప్రజా రాజధాని మారుతుందా.. అని ప్రశ్నించారు. మూడు ముక్కల ఆటతో రాష్ట్ర వెనకబడి పో యిందన్నారు.రాజధాని కోసం చట్టబద్దంగా భూములు ఇస్తే అభి వృద్ధి చేయకపోగా, అక్రమకేసులు బనాయిస్తున్నారని ఆవే దన వ్యక్తం చేశారు. చేతనైతే ప్రత్యేక హోదా తెచ్చి మూడు ప్రాంతాల అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. అమరావతి వెలుగు కార్యక్రమంలో భాగంగా దీపాలు వెలిగించి జై.. అమరావతి నినాదాలు చేశారు. పాలకులు అన్యాయం చేస్తున్నారని,న్యాయదేవత మమ్మల్ని రక్షించాలని వేడుకున్నారు. 

Updated Date - 2021-06-16T05:16:34+05:30 IST