అభివృద్ధి చేతకాక.. మూడు ముక్కలాట

ABN , First Publish Date - 2020-11-26T05:23:45+05:30 IST

రాజధాని అమరావతి కోసం భూములిస్తే అభివృద్ధి చేసుకోవడం చేతకాక మూడు ముక్కలాట మొదలు పెట్టారని రైతులు, మహిళలు మండిపడ్డారు.

అభివృద్ధి చేతకాక.. మూడు ముక్కలాట
నీరుకొండ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న మహిళలు

344వ రోజు ఆందోళనల్లో అమరావతి రైతులు, మహిళలు


తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి, తాడి కొండ, నవంబరు 25: రాజధాని అమరావతి కోసం భూములిస్తే అభివృద్ధి చేసుకోవడం చేతకాక మూడు ముక్కలాట మొదలు పెట్టారని రైతులు, మహిళలు మండిపడ్డారు. రాజధాని రైతులు చేస్తోన్న ఆందోళనలు బుధవారంతో 344వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజధానికి 33 వేల ఎకరాలు భూములిస్తే ఎడా రి, శ్మశానం అని పాలకులనడం దుర్మార్గమని తెలి పారు. ఈ ప్రాంతం రాజధానిగా ప్రకటించక ముందు మూడు పంటలతో సస్యశ్యామలంగా ఉండేదని, ప్రస్తుతం సచివాలయం అసెంబ్లీ, టవర్లు, హైకోరు, పెద్దపెద్ద రోడ్లతో కళకళలాడుతుందన్నారు. అయితే ఈ ప్రాంతానికి ప్రస్తుత పాలకులు తప్పుడు పేర్లు ఆపాదిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎడారి, శ్మశానం అయితే ఇక్కడి నుంచి పాలన ఎలా సాగిస్తు న్నారని ప్రశ్నించారు.  మూడు ముక్కల ఆట కోసం తల్లి లాంటి అమరావతిని తాకట్టు పెడుతున్నారవి వాపో తున్నారు. ఐదు కోట్ల మంది ప్రజలు ఎదురు చూస్తున్న అమరావతి అభివృద్ధి గురించి పాలకులు పట్టించుకోక పోవడం సిగ్గు చేటన్నారు.   


-   మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ, తాడేపల్లి మండలం పెనుమాక గ్రామాల్లో రైతుల చేపట్టిన దీక్షలు 344వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా ఆయా శిబిరాలను పలువురు రైతు సంఘ నేతలు సందర్శించి మద్దతు తెలిపారు. ఒకే రాజధాని అమరావతి అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే వరకు పోరాటం కొనసాగిస్తామని రైతులు తేల్చి చెప్పారు. రాజధాని రైతులకు మద్దతుగా తాడికొండ మండలం మోతడక గ్రామంలో రైతులు, మహిళలు నిరసనలు కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్రానికి లేని విధంగా ఆంధ్రలో మూడు రాజధానులు ఎందుకని ప్రశ్నించారు. పాలనా వికేంద్రీకరణ వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు కల్పించుకోవడం లేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2020-11-26T05:23:45+05:30 IST