నేతాజీ పోరాటం మాకు ఆదర్శం

ABN , First Publish Date - 2021-01-24T06:08:38+05:30 IST

నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాటస్ఫూర్తి తమకు ఆదర్శమని రాజధాని రైతులు స్పష్టం చేశారు. శనివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని తుళ్లూరులో ఆయన విగ్రహం వద్ద మహిళలు, రైతులు ఘననివాళి అర్పించారు.

నేతాజీ పోరాటం మాకు ఆదర్శం
తుళ్లూరులో నేతాజీ విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న రాజధాని మహిళలు

రైతులకు అన్యాయం చేస్తే ఊరుకోం..

రాజధాని అమరావతి రైతులు

403వ రోజుకు చేరిన ఆందోళనలు 

బడేపురంలో అమరావతి పరిరక్షణ మహాసభ విజయవంతం


తుళ్ళూరు, తాడికొండ, మంగళగిరి, తాడే పల్లి, జనవరి 23: నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ పోరాటస్ఫూర్తి తమకు ఆదర్శమని రాజధాని రైతులు స్పష్టం చేశారు. శనివారం సుభాష్‌ చంద్రబోస్‌ జయంతిని పురస్కరించుకుని తుళ్లూరులో ఆయన విగ్రహం వద్ద మహిళలు, రైతులు ఘననివాళి అర్పించారు. అమ రావతే ఏకైక రాజధానిగా కొనసాగించాలని డిమాండ్‌ చేస్తూ ఆ ప్రాంత రైతులు చేపట్టిన ఉద్యమం శనివారం 403వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మహిళలు, రైతులు, రైతు కూలీలు మాట్లాడుతూ రాజధాని అమ రావతిని మూడు ముక్కలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటానికి కుట్ర పన్నారని ఆరోపించారు. రాజధానిలో జరుగుతున్న అభి వృద్ధి పనులను మధ్యలో ఆపేయడం ద్రోహం అన్నారు. రాజధానికి భూములిచ్చిని రైతుల పైనే కక్ష సాధింపు చర్యలు చేపట్టారని ఆరోపించారు.


బడేపురంలో భారీ ర్యాలీ

అమరావతి ఉద్యమం రాజధానికి భూము లు ఇచ్చిన రైతుల సమస్య కాదని రాష్ట్ర అభివృద్ధి సమస్య అని అమరావతి పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కొలికపూడి శ్రీనివా సరావు పేర్కొన్నారు. శనివారం తాడికొండ శివారు బడేపురంలో అమరావతి పరిరక్షణ మహాసభను నిర్వహించారు. ముందుగా గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సంద ర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ రాజధాని లేని రాష్ట్రంలో పెట్టుబడులు రాక, కంపెనీలు లేక  నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడు తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.   మూడు రాజధానులు అక్కరలేదని ఏకైక రాజధానిగా అమరావతినే ఉంచాలని డిమాండ్‌ చేశారు. గాయకుడు రమణ బృందం అమరావతి గీతా లు ఆలపించి ఉత్సాహపరిచారు. తాడికొండ, బడేపురం, మోతడక, పెదపరిమి, పొన్నెకల్లు, నిడుముక్కల గ్రామాల రైతులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొన్నారు. కార్యక్రమంలో సత్తెనపల్లి జేఏసీ మన్నవ శారదాదేవి, పెద పరిమి జేఏసీ నాయకులు ఏ.బాలయ్య చౌద రి, అమరావతి ఏజేసీ సభ్యులు శ్రీనివాస రాజు, మోతడక జేఏసీ కం చర్ల సాంబశివ రావు, టీడీపీ నాయకులు కంతేటి నాగేశ్వరరా వు, మన్నే రమేష్‌బాబు, గుమ్మడి ధర్మారావు, పందేటి వెంకటేశ్వర్లు, ముక్కెర శ్రీను, షేక్‌ రఫీ పాల్గొన్నారు. మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, యర్రబాలెం, నవులూరు, బేతపూడి, నిడమర్రు, నీరుకొండ గ్రామాల్లో రైతులు నిరాహార దీక్షలు చేపట్టారు. తాడేపల్లి మం డలం పెనుమాకలో ఐకాస ఆధ్వర్యంలో రైతులు చేపట్టిన నిరసన దీక్షల్లో ఐకాస నేతలు రైతులు, గ్రామస్తులు పాల్గొన్నారు.   


Updated Date - 2021-01-24T06:08:38+05:30 IST