ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం

ABN , First Publish Date - 2021-07-26T05:09:48+05:30 IST

రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అమరావతి రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజఽధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 586వ రోజుకు చేరుకుంది.

ప్రత్యేక హోదాతోనే అభివృద్ధి సాధ్యం
మందడం శిబిరంలో ఆందోళన చేస్తున్న మహిళలు

586వ రోజు ఆందోళనల్లో రాజధాని రైతులు


తుళ్లూరు, జూలై 25: రాష్ట్రానికి ప్రత్యేక హోదాతోనే  అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమని అమరావతి రైతులు తెలిపారు. రాష్ట్ర ఏకైక రాజఽధానిగా అమరావతి అభివృద్ధి కొనసాగాలని రైతులు చేస్తోన్న ఉద్యమం ఆదివారంతో 586వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా రైతు ధర్నా శిబిరాల నుంచి రైతులు, మహిళలు, కూలీలు మాట్లాడుతూ హోదా ఊసు ఎత్తకుండా మూడు రాజధానుల పేరుతో పాలకులు పబ్బం గడుపుతున్నారన్నారు. ఎందుకంటే కేంద్రం వద్ద మాట్లాడే దమ్ము, ధైర్యం సీఎంకు లేదన్నారు. మూడు రాజధానులతో అభివృద్ధి ఉండదని తెలిసినా సీఎం జగన్‌రెడ్డి ప్రతిపాదన పెట్టారన్నారు. అమరావతి అభివృద్ధిని పక్కన పెట్టడానికి మూడు రాజధానుల ఎత్తుగడ వేశారన్నారు. భూములు ఇచ్చిన రైతులను బాధపెట్టడం కాదు రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేయాలో ఆలోచన చేయాలని కోరారు. పాలకులు వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మూడు ముక్కల ఆట ఆడుతున్నారన్నారు. రాజధాని గ్రామాల్లో దీపాలు వెలిగించి జై అమరావతి అంటూ నినాదాలు చేసి వెలుగు కార్యక్రమం నిర్వహించారు. 


Updated Date - 2021-07-26T05:09:48+05:30 IST