రాజగోపాల్‌రెడ్డి మోదీ ఏజెంట్‌

ABN , First Publish Date - 2022-10-03T06:00:20+05:30 IST

కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు.

రాజగోపాల్‌రెడ్డి మోదీ ఏజెంట్‌
గట్టుప్పల మండల ప్రారంభ సభలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి

మంత్రి జగదీ్‌షరెడ్డి 

గట్టుప్పల మండల కార్యాలయాలు ప్రారంభం



చండూరురూర ల్‌, అక్టోబరు 2: కోవర్టుగా, నరేంద్ర మోదీ ఏజెంట్‌గా మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పనిచేస్తున్నారని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి విమర్శించారు. పరిపాలనా సౌలభ్యం కోసం నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల మండలంలో ఆదివారం నూతన కార్యాలయాలను ఆయన ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడా రు. బ్రిటీష్‌ వారికి, నిజాం రజాకార్లకు భూస్వాములు కోవర్టులుగా మారి దేశాన్ని, రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్లు మునుగోడు ప్రాంత ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్‌రెడ్డి బీజీపీకి తాకట్టు పెట్టారని అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని 2.20లక్షల మంది ఓట ర్ల నమ్మకాన్ని, అభివృద్ధిని స్వలాభం కోసం రూ.22వేల కోట్ల రూపాయలకు అమ్మిన కోవ ర్టు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అని అన్నారు. ఈ ప్రాంతానికి ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. గతంలో ఉప ఎన్నికలు కేవలం ఆ ప్రాంత ఎమ్మెల్యే మృతిచెందితేనో, అనివార్య కారణాలతో రాజీనామా చేసి రాజకీయాలకు దూరంగా ఉంటేనో, రెండు పదవులకు ఎన్నికైతే ఒక దానికి రాజీనామా చేస్తేనే ఉప ఎన్నిక వచ్చేదన్నారు. అయితే స్వలాభం కోసం బహిరంగ మార్కెట్‌లో అమ్ముడుపోయి పార్టీకి, పదవికి రాజీనామా చేసి ఉప ఎన్నికకు గతంలో ఎవ్వరూ వెళ్లలేదని విమర్శించారు. బీజేపీలో చేరి ఈ ప్రాంతానికి అమిత్‌షాను తీసుకువచ్చి ఏం చేశాడు, ఏం తెచ్చాడు, ఎన్ని నిధులు మంజూరు చేయించారని మంత్రి ప్రశ్నించారు. భారతదేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందని, అన్ని రంగాల్లో దేశంలో తొలిస్థానంలో నిలబెట్టిన సీఎం కేసీఆర్‌ నాయకత్వాన్ని దేశ ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయా రాష్ట్రాల ప్రజలు, రైతులు, నాయకుల కోరిక మేరకే సీఎం కేసీఆర్‌ జాతీయ పార్టీని స్థాపిస్తున్నారని పేర్కొన్నారు. మునుగోడు ప్రాంత ప్రజలు 50 సంవత్సరాల నుంచి ఫ్లోరోసిస్‌ బారిన పడి ఎన్నో అవస్థలు పడ్డారని, ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాతే మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ వంటి పథకాలను అమలు చేయడంతో ఈ ప్రాంతంలో ఫ్లోరోసిస్‌ పూర్తిగా రూపుమాసిపోయిందని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకునే సమయం వచ్చిందని అన్నారు. అది గట్టుప్పల మండలం నుంచే మొదలవ్వాలని, రానున్న ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించి గట్టుప్పల, మునుగోడు ప్రజలు సీఎం కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలని అన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, 37 ఏళ్ల కల టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంతో సాకారమైందన్నారు. 1984లో గట్టుప్పల మండల ఏర్పాటుకు ప్రతిపాదన ఉండగా, నేడు ఏర్పాటైందన్నారు. గట్టుప్పల నూతన మండల కార్యాలయాలు ప్రారంభం అనంతరం తహసీల్దార్‌గా పులి సైదులు, ఎస్‌ఐగా ఉప్పు సురేష్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్‌, కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ రెమారాజేశ్వరి, ఆర్డీవో జగన్నాథరావు, గట్టుప్పల ఎన్నికల ఇన్‌చార్జి గొపగాని వెంకట్‌నారాయణ గౌడ్‌, మునగాల నారాయణరావు, గుర్రం వెంకట్‌రెడ్డి, బొమ్మరబోయిన వెంకన్న, అన్నెపర్తి శేఖర్‌, గ్రామ సర్పంచ్‌ ఇడెం రోజా, ఇడెం కైలాసం, ఎంపీటీసీలు అవ్వారు గీతాశ్రీనివాస్‌, చెరుపల్లి భాస్కర్‌, గొరిగ సత్తయ్య, పలువురు సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-03T06:00:20+05:30 IST