Rajagopal Reddy resignation: రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారంటే...

ABN , First Publish Date - 2022-08-04T01:59:05+05:30 IST

మ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్రమైన దుమారం రేపుతోంది.

Rajagopal Reddy resignation: రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఏమన్నారంటే...

హైదరాబాద్: ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి (Rajagopal Reddy) రాజీనామా తెలంగాణ కాంగ్రెస్‌లో తీవ్రమైన దుమారం రేపుతోంది. రాజగోపాల్‌రెడ్డి రాజీనామా వ్యవహారంపై తాను స్పందించనని,  ఏమైనా ఉంటే రాజగోపాల్‌రెడ్డినే అడగాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komati Reddy Venkata Reddy) చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యలు తనను బాధించాయని తెలిపారు. ఈ వ్యాఖ్యల ద్వారా రేవంత్‌ అవమానిస్తున్నారా? అని ప్రశ్నించారు. బ్రాందీ షాపులు పెట్టుకునేవారని మాట్లాడతారా అని నిలదీశారు. రేవంత్‌రెడ్డి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రేవంత్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారా? అని ప్రశ్నించారు. నేషనల్ హెరాల్డ్ ఆఫీస్‌ (National Herald Office)ను సీల్ చేయడాన్ని ఖండిస్తున్నానని తెలిపారు. ఆఫీస్ సీల్ చేస్తే తాను ఒక్కడినే వచ్చానని. మిగిలిని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు ఏమయ్యారు? అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రశ్నించారు.


రాజగోపాల్‌రెడ్డి రాజీనామాపై రేవంత్‌రెడ్డి ఏమన్నారంటే..

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డిపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కన్నతల్లిని చంపే నరహంతకుడిని చూస్తున్నామని రాజగోపాల్‌రెడ్డిని ఉద్ధేశించి వ్యాఖ్యానించారు. ‘‘తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ (Sonia Gandhi)ని అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న వారి తలనరికే సాహసం చేయాల్సిన వ్యక్తులు తేనెపూసిన కత్తిలా మాట్లాడుతూ... అమిత్‌ షా దగ్గర కూర్చొని కాంట్రాక్టుల ఒప్పందం చేసుకున్నారు.’’ అని వ్యాఖ్యానించారు. వాళ్లు విసిరే ఎంగిలి మెతుకుల కోసం, కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతకులుగా మారారని ధ్వజమెత్తారు. తల్లిలాంటి సోనియా గాంధీని అవమానిస్తున్న రోజే శత్రువుతో కలిసి కూర్చున్న రాజగోపాల్‌ రెడ్డికి కాంగ్రెస్‌తో ఉన్న పేగుబంధం తెగిపోయిందన్నారు. ‘‘వ్యాపారాలు చేసుకునే రాజగోపాల్‌ రెడ్డిని కాంగ్రెస్‌ పార్టీ ఎంపీగా గెలిపించింది. ఎంపీకి ఓడిపోతే ఎమ్మెల్సీగా గెలిపించింది. ఎమ్మెల్సీగా ఉండగానే ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చి గెలిపించింది. ఆయన సతీమణికి కూడా ఎమ్మెల్సీ టికెట్‌ ఇచ్చింది. మరో సోదరుడికి జడ్పీటీసీ టికెట్‌ ఇచ్చింది. తరతరాలుగా రుణపడి ఉండేలా ఇవాళ ఆ కుటుంబానికి కాంగ్రెస్‌ అన్ని అవకాశాలు కల్పించింది’’ అని రేవంత్‌రెడ్డి అన్నారు.

Updated Date - 2022-08-04T01:59:05+05:30 IST