రాష్ట్రీయ సాంస్కృతిక్‌ ఉత్సవ్‌కు ఏర్పాట్లు

Published: Fri, 25 Mar 2022 00:46:52 ISTfb-iconwhatsapp-icontwitter-icon
రాష్ట్రీయ సాంస్కృతిక్‌ ఉత్సవ్‌కు ఏర్పాట్లుజార్ఖండ్‌కు చెందిన ట్రైబల్‌ నృత్యకళాకారుల బృందం

సిద్ధమైన ఇతర రాష్ట్రాల కళాకారులు
 రాజమహేంద్రవరం సిటీ, మార్చి 24: కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన రాష్ట్రీయ సాంస్కృతిక్‌ ఉత్సవ్‌లో ప్రదర్శనలు ఇచ్చేందుకు దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల నుంచి సంప్రదాయ నృత్య కళాకారులు తరలివచ్చారు. సాంస్కృతిక నగరమైన రాజమహేంద్రవరంలో ఈ ఉత్సవ్‌ను ఈనెల 26, 27  తేదీల్లో  ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చేందుకు పంజాబ్‌, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, ఒడిసా, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కళాకారుల బృందాలు ఆర్ట్స్‌ కళాశాలకు చేరుకున్నాయి. ఉత్సవ్‌లో పాల్గొనేందుకు రిహార్సల్స్‌ చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల నుంచి 37 బృందాలు ఈ ఉత్సవ్‌లో పాల్గొంటున్నాయి.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.