రాజమండ్రి: విశాఖ- తూర్పుగోదావరి జిల్లా సరిహద్దు గిలామాడుగులు ప్రాంతం వద్ద నాటుపడవ బోల్తా పడింది. ఒడిశా నుంచి ఆంధ్రా సీలేరు నదిలో నాటు పడవపై వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారు వైరామవరం మండలం మంగంపాడు గ్రామానికి చెందిన ఒకరు, టెలిక్యాంప్ గ్రామానికి చెందిన మరొకరుగా గుర్తించారు. విషయం తెలిసిన పోలీసులు అక్కడకు చేరుకుని ఈతగాళ్ల సాయంతో గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ఇవి కూడా చదవండి