70 వేల పాఠ్య పుస్తకాలు గొడౌన్లలోనే

ABN , First Publish Date - 2022-08-09T07:06:07+05:30 IST

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 8 : పాఠశాలలు తెరచి నెలరోజులు దాటేసింది. కానీ ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తిగా పాఠశాలలకు చేరలేదు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కార్యాలయం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటికీ ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయి. మొత్తం పాత తూర్పుగోదావరి జిల్లాకు 36,94,040 పుస్తకాలు అవ సరం. ఇప్పటివరకూ 36,

70 వేల పాఠ్య పుస్తకాలు గొడౌన్లలోనే

రాజమహేంద్రవరం (ఆంధ్రజ్యోతి), ఆగస్టు 8 : పాఠశాలలు తెరచి నెలరోజులు దాటేసింది. కానీ ఇంకా పాఠ్యపుస్తకాలు పూర్తిగా  పాఠశాలలకు చేరలేదు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌ సమీపంలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాల కార్యాలయం ఉంది.  ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంతటికీ ఇక్కడ నుంచే సరఫరా అవుతున్నాయి. మొత్తం పాత తూర్పుగోదావరి జిల్లాకు 36,94,040 పుస్తకాలు అవ సరం. ఇప్పటివరకూ 36,23,993 పుస్తకా లు పంపిణీ అయ్యాయి. ఇవి కూడా పూ ర్తి పాఠశాలలకు చేరలేదు. వాటితో ఇంకా 70,.047 పుస్తకాలు ప్రభుత్వ పాఠ్యపుస్తకా ల విక్రయ కార్యాలయం గొడౌన్‌లోనే ఉండిపోయాయి. మరో వారంరోజుల్లో మొత్తం చేరతాయని అధికారులు చెబుతున్నారు.  కాకినాడ, కోనసీమ జిల్లాలకు కూడా చేరవలసి ఉంది. అల్లూరి సీతారామరాజు జిల్లా పరిధిలోని ఏజెన్సీలకి అసలు పుస్తకాలు వెళ్లకపోవ డం గమనార్హం. కొవ్వూరు డివిజన్‌కు తాడేపల్లిగూడెంలోని  ప్రభుత్వ పుస్తక విక్రయ కార్యాలయం నుంచి సరఫరా కావలసి ఉంది.

Updated Date - 2022-08-09T07:06:07+05:30 IST