రాజన్న హుండీ లెక్కింపు

Jul 30 2021 @ 01:09AM
హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ సిబ్బంది, అధికారులు

- 1.20 కోట్లు  ఆదాయం

వేములవాడ, జూలై 29: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఖజానాకు హుండీ ద్వారా కోటి 20 లక్షలకు పైగా ఆదాయం సమకూరింది. 25 రోజుల వ్యవధిలో భక్తులు శ్రీస్వామివారికి హుండీలలో సమర్పించిన నగదు, బంగారం, వెండి కానుకలను గురువారం నాడు ఆలయ ఓపెన్‌ స్లాబ్‌ ప్రాంగణంలో లెక్కించారు. ఈ సందర్భంగా కోటి 20 లక్షల 49 వేల 368 రూపాయల నగదు, 198 గ్రాముల బంగారం, 11 కిలోల 500 గ్రాముల వెండి సమకూరింది. ఆలయ ఈవో కృష్ణప్రసాద్‌ హుండీ లెక్కింపు పర్యవేక్షించారు.

Follow Us on: