Rajasingh's wife: నా భర్తపై పీడీయాక్ట్ రద్దు చేయండి... గవర్నర్‌కు రాజాసింగ్ సతీమణి విజ్ఞప్తి

ABN , First Publish Date - 2022-09-18T19:48:01+05:30 IST

రాష్ట్ర గవర్నర్ తమిళిసైతో గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ సతీమణి ఉషా బాయి ఆదివారం సమావేశమయ్యారు.

Rajasingh's wife: నా భర్తపై పీడీయాక్ట్ రద్దు చేయండి... గవర్నర్‌కు రాజాసింగ్ సతీమణి విజ్ఞప్తి

హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై(Tamilisi)తో గోషామహాల్ ఎమ్మెల్యే రాజసింగ్ సతీమణి(Rajasingh wife) ఉషాభాయి ఆదివారం సమావేశమయ్యారు. తన భర్తపై పీడీ యాక్ట్‌ను రద్దు చేయాలంటూ ఈ సందర్భంగా గవర్నర్‌ (Telangana governor)కు రాజాసింగ్(BJP MLA) సతీమణి  విజ్ఞప్తి చేశారు. తన భర్తపై అక్రమంగా కేసులు పెట్టారని గవర్నర్‌కు లేఖ అందజేశారు. ఒక వర్గాన్ని సంతృప్తి పరిచేలా తెలంగాణ ప్రభుత్వం (Telangana government) వ్యవహరిస్తోందని ఉషాభాయి (Usha bhai) లేఖలో పేర్కొన్నారు. 



కాగా... గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రస్తుతం పీడీయాక్ట్ కింద చర్లపల్లి జైల్లో ఉన్నారు. అయితే తన భర్తపై తెలంగాణ ప్రభుత్వం (Telangana government) అక్రమంగా కేసులు బనాయించిందని, వీటిపై జోక్యం చేసుకోవాలంటూ గవర్నర్‌కు ఉషాభాయి వినతి చేశారు. తన భర్తపై ఉద్దేశపూర్వకంగానే కేసులు పెట్టారని ఫిర్యాదు చేశారు. రాజాసింగ్ సతీమణి గతకొద్దిరోజులుగా న్యాయం చేయాలంటూ అటు కేంద్ర ప్రభుత్వాని(central government)కి, గవర్నర్‌‌తో పాటు అవకాశం ఉన్న ప్రతీ చోట ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే గవర్నర్‌ను కలిసిన ఉషాభాయి... తన భర్తపై కేసులు ఎత్తివేయాలని లేఖ అందజేశారు. ఇంకోవైపు ప్రభుత్వం చెబుతున్నట్లు వంద కేసులు తన భర్తపై లేవని, అవన్నీ ప్రజాకోర్టులో కొట్టేసినవే అని తెలిపారు. ప్రభుత్వం ఒక వర్గానికి మాత్రమే కొమ్ముకాసేలా వ్యవహరిస్తోందని, దాన్ని ప్రశ్నించిన రాజాసింగ్‌పై తప్పుడు కేసులు పెట్టిందని రాజాసింగ్ సతీమణి తెలిపారు. ఉషాభాయితో పాటు ఒకరిద్దరు మహిళలు గవర్నర్‌ను కలిసిన వారిలో ఉన్నారు. 



Updated Date - 2022-09-18T19:48:01+05:30 IST